భార్య తిరస్కరించిందని... పోర్షే కారును చెత్తకుప్పలో వేసిన భర్త!

రష్యా రాజధాని మాస్కో సమీపంలోని మైటిష్చిలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. విఫలమైన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఓ భర్త సీరియస్ గా ఓ ప్రయత్నం చేశాడు.

Update: 2025-02-27 04:06 GMT

భార్యకు వాలంటైన్స్ డే నాడు ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు ఆమె భర్త. అయితే.. ఆ బహుమతి ఆమెకు నచ్చకపోవడంతో దాన్ని తిరస్కరించింది. ఈ సమయంలో.. భర్త కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ బహుమతి తనకూ వద్దని తీసుకెళ్లి పెద్ద చెత్త కంటైనర్ లో పడేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ గా మారిందని అంటున్నారు!

అవును... రష్యా రాజధాని మాస్కో సమీపంలోని మైటిష్చిలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. విఫలమైన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఓ భర్త సీరియస్ గా ఓ ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భార్యకు విలాసవంతమైన పోర్షే మకాన్ కారును బహుమతిగా ఇచ్చాడు.

అయితే.. ఆమె ఆ బహుమతిని తిరస్కరించింది. దీంతో.. దాన్ని చెత్త డబ్బాలో వేశాడు. దీంతో... ఇప్పుడు ఆ చెత్త బుట్టలో పోర్షే కారు ప్రాంతం పర్యాటక ఆకర్షణగా మారడం గమనార్హం.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ జంట కొంతకాలంగా వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో.. సుమారు 3 మిలియన్ రూబిళ్లు (దాదాపు 27 లక్షల రూపాయలు) కారును కొనుగోలు చేసి ఇవ్వాలనుకున్నాడు. అయితే.. అది గతంలో ఓ ప్రమాదంలో దెబ్బతిన్న కారు కాగా.. దాన్ని పూర్తిగా రిపేర్ చేసి తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు.

వాస్తవానికి ఈ కారును తొలుత మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న ఇవ్వాలనుకున్నాడు. అయితే... ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కావడంతో ఆమెను ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకున్నడు. అయితే... ఎర్ర రిబ్బన్ చుట్టబడి ఉన్నప్పటికీ ఆ కారు దెబ్బతినందని గ్రహించిన భర్య.. ఆ బహుమతిని తిరస్కరించింది.

దీంతో... ఆ వ్యక్తి ఈ పోర్షే కారును పెద్ద చెత్త కంటైనర్ లో వేయడం ప్రారంభించాడు. దీంతో.. అతను అంత లగ్జరీ కారును చెత్తకుప్పలో ఎలా వేయగలిగాడు అనేది ఆసక్తిగా మారగా.. అంత పెద్ద కారును ఆ చెత్త కంటైనర్ లో ఎలా అమర్చగలిగాడనేది మిస్టరీగా మారిందని అంటున్నారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ చెత్తబుట్టలోని లగ్జరీ కారు ఫోటోలు తీసుకునేందుకు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి భర్త చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.. ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News