భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య... కారణం ఇదే!
భర్తపై కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్స్ ని కత్తితో కోసేసింది అతడి భార్య.;
అత్యంత దారుణమైన ఘటన హోలీ రోజున జరిగింది. బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో హోలీ రోజున ఓ మహిళ తన భర్త ప్రైవేటు భాగాలపై కత్తితో దాడి చేసింది. అనంతరం.. ఇటుకతో తలపై కొట్టి హత్య చేసింది. ఈ ఘటత్న కర్తాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని భటౌలి గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
అవును... భర్తపై కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్స్ ని కత్తితో కోసేసింది అతడి భార్య. అక్కడికీ ఆమె ఆగ్రహం చల్లారలేదో ఏమో కానీ.. ఆ బాధతో విలవిల్లాడుతున్న భర్తను ఇటుకతో తలపై కొట్టి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిథిలేష్ పాశ్వాన్ (35), ప్రియాంక దేవి అనే జంట హోలీ రోజున తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ప్రియాంక తన ప్రేమికుడితో మాట్లాడుతుండగా.. మిథిలేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఈ సమయంలో ప్రియాంక కోపంతో కత్తి తీసుకుని మిథిలేష్ పై దాడి చేసింది.. అనంతరం అతని రెండు కాళ్ల మధ్య పొడిచింది. అనంతరం ఇటుకతో తలపై కొట్టింది!
దీంతో మిథిలేష్ ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే... అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు. ప్రియాంకను అరెస్ట్ చేశారు. అనంతరం మిథిలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
దీనిపై స్పందించిన సబ్-డివిజనల్ పోలీస్ అధికారి... హోలీ సందర్భంగా భార్యభర్తల మధ్య ఏదో ఒక విషయంపై వివాదం తలెత్తిందని.. ఈ సమయంలో భార్య, తన భర్త ప్రైవేట్ భాగలపై కత్తితో దాడి చేసి, ఇటుకతో తలపై కొట్టిందని.. ఈ దాడిలో ఆమె భర్త మరణించాడని.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని.. ఆమె నేరాన్ని అంగీకరించిందని తెలిపారు.