బాలయ్యకు జనవరి జాలీ... కల నేరే చాన్స్ ?
ఇదిలా ఉంటే బాలయ్యను ఈసారి పద్మభూషణ్ అవార్డు ని కచ్చితంగా వరిస్తుందని అంటున్నారు.
టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలక్రిష్ణ మరి కొద్ది నెలలలో పద్మ భూషణుడు అవుతున్నారా అంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే అవును అనే జవాబు వస్తోంది.సుమారు రెండు నెలల క్రితం బాలయ్య పేరుతో పాటు మరో సీనియర్ హీరో పేరుని సిఫార్సు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిందని అప్పట్లో చెప్పుకున్నారు
ఇదిలా ఉంటే బాలయ్యను ఈసారి పద్మభూషణ్ అవార్డు ని కచ్చితంగా వరిస్తుందని అంటున్నారు. ఆయన ఈ ఏడాదే యాభై ఏళ్ళ సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. అది ఆయన సాధించిన అరుదైన రికార్డుగా ఉంది. అంతే కాదు దాదాపు 110 చిత్రాల దాకా విభిన్న జానర్లలో నటించారు.
మరో వైపు బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ రోజున ఆయన టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్నారని అంటున్నారు. ఆయన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా వరస హిట్లు కొడుతున్నారని చెబుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు రాజకీయంగా చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ ఉంది. ఈ నేపధ్యంలో సీనియర్ మోస్ట్ నటుడిగా బాలయ్యకు తగిన పురస్కారం దక్కడం అన్నది అందరూ చాలా కాలంగా కోరుకుంటున్నారని అది ఇప్పటికి సాకారం కాబోతోంది అని అంటున్నారు.
ఇక పద్మ అవార్డుల సెలెక్షన్ ప్రక్రియ నవంబర్ లో మొదలైందని డిసెంబర్ లో అది కొనసాగుతుందని జనవరి 26న రిపబ్లిక్ డే వేళ పద్మ అవార్డీల పేరు ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి 2007లో పద్మ భూషణ్ అవార్డుని అందుకున్నారు.
ఇక గత ఏడాది దేశంలోనే రెండవ అతి పెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్ ని అందుకున్నారు. ఆయనతో సమకాలీనుడు అయిన బాలయ్యకు కూడా పద్మ అవార్డులు ఇవ్వాలన్న డిమాండ్ గత ఏడాది నుంచి మొదలైంది. అది ఈ ఏడాది సాకారం కాబోంది అని అంటున్నారు.
ఇక చూస్తే కనుక జనవరి 12న బాలయ్య నటించిన డాకూ మహరాజ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అది బాలయ్య అభిమానులకు ఒక గిఫ్ట్ అయితే అదే నెల 26న పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఉంటుందని అంటున్నారు. మరి అది అసలైన పండుగ అని చెబుతున్నారు. మొత్తానికి కొత్త ఏడాది జనవరి వస్తూనే అటు బాలయ్యకు ఇటు అభిమానులకూ జాలీ మంత్ గా మారుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.