గుడివాడ తమ్ముళ్ల డిమాండ్ విన్నారా బాబూ!
గతంలో నారా కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీని అరెస్టు చేశారు.
రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో నోరు పారేసుకుని దూషణలతో విరుచుకు పడిన వారిని వరుస పెట్టి.. అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరిని సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేస్తుంటే.. మరికొందరిని ఇతర కేసుల్లోనూ అరెస్టు చేస్తున్నారు. గత వారంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో నారా కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. కారణం ఏదైనా ఆయన జైల్లో ఉన్నారు.
దీంతో గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అరెస్టు తర్వాత.. అంతో ఇంతో తమకు సానుభూతి వస్తుందని అనుకున్నా.. నాయకులకు అలాంటిదేమీ చిక్కలేదు. ఇక, ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్టు., దీనిపై కూడా.. టీడీపీ నాయకులు సహాజనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాపం అమాయకుడు.. అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో పోసాని చేసిన వ్యాఖ్యల వీడియోలను వైరల్ చేస్తున్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు గుడివాడ తమ్ముళ్లు ఆవేదనలో ఉన్నారు. ఇక్కడ నుంచి గతంలో విజయందక్కించు కుని వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని అరెస్టు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నా రు. చంద్రబాబు, నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. చంద్రబాబును వాడు.. వీడు అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇన్ని నెలలు అయిపోయినా.. గుడివాడ నానిపై ఎవరూ ఫిర్యాదులు చేయలేదా? లేక చేసినా.. మౌనంగా ఉన్నారా? అనేది పెద్ద చర్చగా మారింది.
పెట్టాలంటే అనేక కేసులు..!
గుడివాడ నానీపై పెట్టాలంటే.. అనేక కేసులు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో నేరుగా చంద్రబాబుపైనా.. నారా లోకేష్‌లపైనా చేసిన దూషణలను ప్రస్తావిస్తున్నారు. అలాగే.. తన సొంత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేదికలు నిర్మించి.. క్యాసినో వంటివి ఆడించిన విషయాన్ని కూడా ప్రస్తావి స్తున్నారు. ఇక, దురుసు ప్రవర్తన, నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు ఉండనే వున్నాయి. అయినప్పటికీ.. నానీ విషయంలో ఎందుకో ఉదాసీనంగా ఉన్నారంటూ.. గుడివాడ నేతలు గుసగుసలా డుతుండడం గమనార్హం.