జగన్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిందే ?

అయితే ఈ నియామకాలు అన్నీ కాగితాల మీద కనిపిస్తున్నాయి తప్ప నేతలు మాత్రం జనంలోకి వెళ్లడం లేదు.

Update: 2024-10-10 01:30 GMT

వైసీపీలో తెలియని నిస్తేజం ఆవహించింది. పార్టీ ఘోర ఓటమి చెందింది. అదే సమయంలో నాలుగు నెలలు అయినా అదే విధంగా ఉండిపోతోంది. ఆ మధ్య దాకా జగన్ అడపా తడపా జిల్లాలకు వెళ్ళేవారు. పరమర్శ పేరుతో బయట కనిపించేవారు. ఇపుడు అది కూడా లేదు అని అంటున్నారు.

ఆయన తాడేపల్లిలో ఎపుడు ఉంటున్నారో లేక బెంగళూరుకు ఎపుడు వెళ్తున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు. వివిధ జిల్లాలకు తనకు అందుబాటులో ఉన్న వారిని జగన్ అధ్యక్షులుగా పెట్టారు. చూడబోతే వారంతా పాత ముఖాలే. పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రులుగా చేసి క్యాడర్ ని దూరం పెట్టిన వారే. ఇపుడు వారే పార్టీ బండిని లాగాలని జగన్ వారికి బాధ్యతలు అప్పగించారు.

అయితే ఈ నియామకాలు అన్నీ కాగితాల మీద కనిపిస్తున్నాయి తప్ప నేతలు మాత్రం జనంలోకి వెళ్లడం లేదు. ఎవరికి ఏ పదవి వచ్చినా అది జస్ట్ మీడియాలోనే కనిపిస్తోంది. వైసీపీకి ఉన్న ఎమ్మెల్సీలు 30కి పైగానే. అలాగే వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యులు ఎనిమిది మంది. అలాగే లోక్ సభ సభ్యులు నలుగురు ఉన్నారు. ఎమ్మెల్యేలు జగన్ కాకుండా పది మంది ఉన్నారు ఇంకా జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్లు, మేయరులు, అలాగే మండల గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు వందల్లో ఉన్నారు. వేలల్లో పార్టీ బాధ్యులు ఉన్నారు.

వీరిలో ఏ ఒక్కరిలోనూ కదలిక అయితే లేదు. ఎందుకు ఇలా అంటే పార్టీ పట్ల అభిమానం ఉన్నా ఏమో జనంలోకి వెళ్తే రిసీవింగ్ ఎలా ఉంటుందో అన్నది ఒక్కటి అయితే పార్టీలో ఉన్న స్తబ్దత కూడా వారిని అలా దూరం పెడుతోంది. ఈ నేపథ్యం నుంచి చూసుకున్నపుడు వైసీపీలో తిరిగి చలనం రావాలన్నా పుంజుకోవాలన్నా కూడా జగనే పూనుకోవాలి అని అంటున్నారు.

ఆయన తాడేపల్లి దాటి బయటకు వచ్చి జిల్లాల టూర్లు చేయాల్సిందే అని అంటున్నారు. ఆయన వరసబెట్టి జిల్లాలు తిరిగిగే ఆటోమేటిక్ గా జనాలు వస్తారని అలా వచ్చిన జనాలు వారి ఆదరణ చూస్తే కనుక క్యాడర్ కి లీడర్ కి కూడా నూతన ఉత్తేజం వస్తుందని అంటున్నారు.

అంతే తప్ప తాడేపల్లిలోని ఆఫీసులో కూర్చుని మనకు జనం బలం ఉందని జగన్ చెప్పినంత మాత్రాన నేతలు నమ్మలేకపోతున్నారు అని అంటున్నారు. దానికి అద్దంలో పెట్టి చూపించినట్లుగా జగన్ జనంలో ఉంటూ చూపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

జగన్ వరకూ చూస్తే జిల్లాల బాధ్యులే తమ పని చేయాలని ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు అంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలలో అధినాయకుడే సర్వస్వం ఆయన చుట్టూనే పార్టీ తిరుగుతుంది. కాబట్టి జగన్ కచ్చితంగా జనంలోకి రావాల్సి ఉందని అంటున్నారు. ఆ విధంగా జగన్ ప్రజాదరణ రుజువు అయిన నాడే వైసీపీ నుంచి బయటకు వెళ్ళే గోడ దూకుళ్ళు కూడా ఆగుతాయని నాయకులు కూడా జనంలోకి వస్తారని అంటున్నరు. మరి జగన్ జనంలోకి వచ్చే ఆ ముహూర్తం ఎపుడు అన్నదే వైసీపీలో సాగుతున్న అతి పెద్ద చర్చగా ఉందిట.

Tags:    

Similar News