అటు ఏసీబీ ఇటు ఈడీ... కేటీఆర్ ఇష్యూ సీరియస్సేనా ?

2024 పోతూ పోతూ ఏడాది చివరిలో కేటీఆర్ మీద కేసులు నమోదు చేసింది.

Update: 2025-01-04 03:37 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కొత్త ఏడాది మొదట్లోనే సమస్యలు చుట్టుముడుతున్నాయా అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. 2024 పోతూ పోతూ ఏడాది చివరిలో కేటీఆర్ మీద కేసులు నమోదు చేసింది. ఒక వైపు ఏసీబీ ఇంకో వైపు ఈడీ కూడా కేటీఆర్ మీద గురి పెట్టాయి.

ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ ని ఏ వన్ గా పేర్కోంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఏసీబీ ఇలా కేసు నమోదు చేయగానే ఈడీ కూడా అంతే వేగంగా కేటీఆర్ కేసులో ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు ఈ రెండు వైపుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి కేస్ల తాకిడి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే వరసగా రెండు రోజుల పటు ఏసీబీ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావడం. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో విచారణకు తమ ముందుకు రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఇదే కేసులో కేటీఆర్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారుల నుంచి కూడా నోటీసులు అందాయి. ఈ నెల 7వ తేదీన విచారణకు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అంటే వరసగా రెండు విచారణ సంస్థల ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది అన్న మాట.

అయితే దీని మీదనే చర్చ సాగుతోంది. 7వ తేదీన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉన్న సమయంలోనే ఏసీబీ అధికారులు 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో అసలు ఈ కేసులో ఏమి జరుగుతోంది అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి తాను ఏ తప్పూ చేయలేదని అది పెద్ద కేసు కాదని కేటీఆర్ ఒక వైపు అంటూంటే బీఆర్ఎస్ శిబిరంలో మాత్రం కలవరం రేగుతోంది. సాధారణంగా విచారణకు రాజకీయ ప్రముఖులను పిలిచిన తరువాత అరెస్ట్ చేయడం కూడా ఇటీవల కాలంలో జరుగుతోంది.

దాంతో కేటీఆర్ కేసులో ఏమి జరగబోతోంది అని అంతా ఆలోచిస్తున్నారు. వరస తేదీలలో ఏసీబీ ఈడీ కేటీఆర్ ని విచారణకు పిలవడం ద్వారా కేసు తీవ్రత ఏంటో చెప్పకనే చెప్పారా అన్నది కూడా చర్చగా ఉంది. మరి ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏమి చేస్తారు విచారణకు తాను స్వయంగా హాజరవుతారా లేక తన న్యాయవాదులను పంపిస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ నెల 6, 7 తేదీలు బీఆర్ఎస్ కి కేటీఆర్ కి టెస్టింగ్ టైం గా మారుతున్నాయా అని అంతా ఆలోచిస్తున్న నేపధయ్మ్ అయితే ఉంది.

Tags:    

Similar News