ఆర్జీవీ ఇంటర్వ్యూలపై పోలీసులు సీరియస్... వాట్ నెక్స్ట్ అంటే..?
సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసు అనే వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసు అనే వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ కోసం రెండు రాష్ట్రాల్లో, మూడు ప్రాంతాల్లో, ఆరు బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారనే కథనాలొస్తున్న వేళ.. ఇప్పటి వరకూ పోలీసులు తనకోసం తన "ఆర్జీవీ డెన్" లోపలకు రాలేందంటూ ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆర్జీవీ ఆచూకీ కోసం పోలీసులు అవిరామంగా వెతుకుతున్నారని కథనాలు హల్ చల్ చేస్తున్న వేళ ఆయన వరుస ఇంటర్వ్యూలు టెలీకాస్ట్ అయ్యాయి. దీంతో.. అసలు ఆర్జీవీ కేసుల వ్యవహారంలో ఏమి జరుగుతుంది అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు సుమారు 22 పాయింట్లతో ఎక్స్ లో ఓ భారీ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.
అవును.. విచారణకు రావాలని నోటీసులు ఇస్తుంటే.. షూటింగుల్లో బిజీగా ఉన్నానని, ఆన్ లైన్ లో విచారణకు మాత్రం ఓకే అంటూ ఆర్జీవీ పోలీసులకు చెబుతున్న సంగతి తెలిసిందే! విచారణకు రమ్మంటే మాత్రం అలా చెబుతూ.. ఆయన మాత్రం హైదరబాద్ లోని తన డెన్ లోనే ఉన్నానని వెల్లడిస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. తన వాదనను ఎక్స్ వేదికగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ వ్యవహారాలపై ఏపీ పోలీసులు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కావాలంటూ.. ఆయన న్యాయవాదులు హైదరాబాద్ వెళ్లిన పోలీసులను కోరారు. అందుకు వారు చెప్పిన కారణం.. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం అని తెలిపారు. ఇదే సమయంలో.. వర్చువల్ విధానంలో విచారించొచ్చని తెలిపారు.
అయితే... అందుకు అంగీకరించలేదని అంటున్నారు. ఆ నేపథ్యంలోనే వర్మ తనవద్ద ఉన్న ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేశారని చెబుతున్నారు. ఈ సమయంలో... అర్జీవీ కోసం రిసార్టులు, ఫాంహౌస్ లు తిరగడం పోలీసులు మొదలుపెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాను కోయంబత్తూరులో ఉన్నారనేలా ఎక్స్ లో ఓ పోస్ట్ వెలిసింది. దీంతో.. పోలీసులు అక్కడకూ వెళ్లారట. అయితే.. అక్కడా వర్మ లేరు!
ఈ స్థాయిలో పోలీసులు వర్మ కోసం తీవ్రంగా గాలిస్తున్నారని చెబుతున్న వేళ హఠాత్తుగా బుల్లితెరపై దర్శనమిచ్చారు ఆర్జీవీ. ఈ సందర్భంగా పోలీసుల చర్యలు, విచారణ, కేసులు, సెక్షన్లు, చట్టాలు మొదలైన అంశాలపై తనదైన విశ్లేషణ చేస్తూ వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. దీనిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారని.. తదుపరి చర్యల దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
మరోపక్క.. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం డిసెంబర్ 2 కు వాయిదా వేసింది. మరి అప్పటిలోగా పోలీసులు వర్మను కస్టడీలోకి తీసుకొని విచారిస్తారా..? ఆ అవకాశం వర్మ పోలీసులకు ఇస్తారా..? డిసెంబర్ 2 వరకూ వేచి చూస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.