అవునా.. నిజమేనా.. జగన్‌పై ఎగస్పార్టీ జెండా ఎత్తేస్తారా?
ఆయనపై ఎగస్పా ర్టీ జెండా కట్టేందుకు నాయకులు సిద్ధమయ్యారా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినా
వైసీపీలో తిరుగుబాటుకు తెరలేచిందా? ఇంకేముంది.. సీఎం జగన్‌ను ఏకేసేందుకు.. ఆయనపై ఎగస్పా ర్టీ జెండా కట్టేందుకు నాయకులు సిద్ధమయ్యారా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినా.. నాయకులు ఎత్తడం లేదా? ఇక, వారంతా.. వైసీపీకి రాం రాం చెప్పేసి.. గుండుగుత్తగా.. ప్రత్యర్థి పక్షానికి జై కొట్టేస్తారా? .. ఇదీ ఇప్పుడు ఏపీలో ఓవర్గం చేస్తున్న హల్చల్. దీనికి అనుకూలంగా కూడా కొన్ని మాధ్యమా ల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఏదో జరుగుతోందనే చర్చ తెరమీదికి వచ్చేసింది.
దీంతో అసలు ఈ వార్గలు.. కామెంట్లు.. ప్రచారంలో ఉన్న వాస్తవం ఎంత? ఇలా.. జగన్‌కు ఎదురెళ్లి నిలబ డే సత్తా.. గెలిచేసత్తా ఎంతమందికి ఉంది? అనేది వైసీపీలోనూ చర్చగా మారింది. అయితే.. ఈ వార్తలు.. కథలు.. పోస్టులపై వైసీపీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది. ఎక్కడా దీనిని కనీసం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం.. అసలు ఇలాంటి వాతావరణంకానీ.. నాయకులు ఇలాంటి సాహసం కానీ.. చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే.. అవన్నీ.. జగన్ పెంచిన మొక్కలే. అవే.. మహావృక్షాలై.. నేడు రాజకీయంగా కుదురుకున్నాయి.
ఇప్పుడు టికెట్ దక్కలేదనో.. లేక.. తమకు ప్రాధాన్యం ఇవ్వలేదనో అనుకుంటున్న నాయకులు.. వెను దిరిగి చూసుకుంటే.. 2014లో అయినా.. 2019లో అయినా.. వెన్నుతట్టి వారిని ప్రోత్సహించింది ఎవరు? వారికి ఇక, రాజకీయంగా దారులు మూసుకుపోయాయని భావిస్తున్న సమయంలో రెడ్ కార్పెట్ పరిచి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది ఎవరు? అంటే.. అన్ని వేళ్లూ చూపించేది.. అందరి నోళ్లు పలికేవీ.. జగన్ గురించే. స్వోత్కర్షలు.. ఎలా ఉన్నప్పటికీ.. ఇది మాత్రం పచ్చినిజం.
2014లో కాంగ్రెస్‌కూకటి వేళ్లతో సహా కూలిపోయినప్పుడు నేనున్నానంటూ.. నాటి కాంగ్రెస్ నేతలకు ధైర్యం చెప్పింది జగన్. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసింది జగన్. సామాజిక వర్గాలకు ఎడతెగని ప్రాధాన్యం ఇచ్చి.. పదవులు పంచింది.. సమాజంలో చెరగని గుర్తింపు ఇచ్చింది జగన్. ఇవన్నీ.. ఇతరులకు లేదా.. ప్రత్యర్థి వర్గాలకు గుర్తుండకపోవచ్చు.. ఉన్నా.. రాజకీయం చేయొచ్చు.
కానీ, పదవులు పొందిన వారు.. వెన్నుతట్టి ప్రోత్సాహానికి గురైన వారు.. మాత్రం జగన్‌ను ఎదరించాలనే ఆలోచన కానీ.. ఆయనకు ఎదురు చెప్పాలనే ఉద్దేశంతోకానీ లేరనేది వైసీపీ ప్రగాఢంగా నమ్ముతున్న మాట. అయితే.. గాలివాటానికి చెట్టు కొమ్మలు ఊగినట్టు.. కొంత ఎన్నికల సమయంలో నాయకుల మనోభావాలు కూడా అలానే కదిలి వుండొచ్చని అంటున్నారు. అయితే.. ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటారని.. పార్టీనేతలు విశ్లేషిస్తున్నారు.