దేశీయ విమానాల శీతాకాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎంత భారీగా అంటే?

ఇటీవల కాలంతో పోలిస్తే ఈ శీతాకాల సీజన్ లో విమానసర్వీసులు భారీగా పెంచనున్న విషయాన్ని డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) వెల్లడించింది.

Update: 2024-10-18 04:11 GMT

ఇటీవల కాలంతో పోలిస్తే ఈ శీతాకాల సీజన్ లో విమానసర్వీసులు భారీగా పెంచనున్న విషయాన్ని డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 124 విమానాశ్రయాల నుంచి వారానికి 25వేలకుపైగా విమానసర్వీసుల్ని నడపనున్నట్లుగా పేర్కొంది. వేసవి షెడ్యూల్ తో పోలిస్తే వింటర్ సీజన్ లో నడిపే సర్వీసులు 3 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.

అంతేకాదు.. 2023 శీతాకాలంతో పోల్చినా.. ఈసారి వింటర్ సీజన లో 5.37 శాతం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. శీతాకాల షెడ్యూల్ అక్టోబరు 27తో మొదలై.. 2025 మార్చి 29తో ముగియనుంది. దేశీయంగా నడిపే ఈ వింటర్ సీజన్ లో అగ్రగామిగా ఇండిగో నిలిచింది. ఈ షెడ్యూల్ లో 13,691 విమానాల్ని నడపనున్నారు. సమ్మర్ సీజన్ లో 13,050 విమాన సర్వీసులతో పోలిస్తే ఇది 4.91 శాతం ఎక్కువగా చెప్పాలి.

ఇండిగో తర్వాత ఎక్కువ సర్వీసుల్ని నడపనున్న విమానయాన సంస్థగా టాటా గ్రూపులోని ఎయిరిండియా.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్.. విస్తారాలు ఉన్నాయి. ఇవి మొత్తం 7611 సర్వీసుల్ని నడపనున్నాయి. ఇందులో ఎయిరిండియా 2586 సర్వీసులు.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ 2832.. విస్తారా 2193 సర్వీసుల్ని నిర్వహించనున్నాయి. తర్వాతి విమానయాన సంస్థలుగా స్పైస్ జెట్ 1297 సర్వీసులు.. ఆకాశ ఎయిర్ 989 సర్వీసులు నడపనున్నాయి.

Tags:    

Similar News