మోడీ సెక్యూరిటీలో మహిళా కమాండో... అసలు విషయం ఏమిటంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారనే విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Update: 2024-11-29 05:43 GMT

భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారనే విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటో కారణంగా.. నెట్టింట ఈ చర్చ విస్తృతంగా మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది!


అవును... ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు అనే టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కంగన రనౌత్ పెట్టిన పోస్ట్ ఈ చర్చకు దారి తీసింది. ఈ ఫోటోలో పార్లమెంట్ వద్ద ప్రధాని నడుస్తుండగా.. ఆయన వెనుక ఓ మహిళా సెక్యూరిటీ అధికారి కనిపించారు.

దీనికి సంబంధించిన ఫోటోను ఎంపీ కంగనా రనౌత్ తన ఇన్ స్టా స్టోరీస్ లో పంచుకున్నారు. దీంతో.. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో పాటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. వాస్తవానికి ఈ ఫోటో కింద కంగన ఎలాంటి క్యాప్షన్ రాయనప్పటికీ.. ఆ ఫోటోలో ప్రధాని పక్కన కనిపిస్తున్న మహిళ.. ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో సభ్యురాలే అయి ఉండోచ్చనే చర్చ మొదలైంది.

అయితే... ఈ ఫోటోలో ప్రధాని వెంట కనిపించిన మహిళ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్.పీ.జీ) టీమ్ లో భాగం కాదని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని తెలిపాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీ.ఆర్.పీ.ఎఫ్.) లో ఆమె అసిస్టెంట్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాయి.

కాగా... మాజీ ప్రధాని ఇందిరగాంధీ 1984లో హత్య గావింపబడిన నేపథ్యంలో ప్రధాన మంత్రి, వారి కుటుంబ సభ్యుల భద్రత కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే... 1985లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటైంది.

Tags:    

Similar News