Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే....రాసలీల గుట్టు రట్టు!

తన మీద జూలై నెల 6న తేదీన ఒక హొటల్ లో లైంగిక దాడి చేశాడు అని కూడా సదరు మహిళ ఆరోపించారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 8:00 AM GMT
అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే....రాసలీల గుట్టు రట్టు!
X

టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అడ్డంగా దొరికేశారా అంటే బాధిత మహిళ మీడియా సాక్షిగా చేసిన ఆరోపణలు, బయట పెట్టిన వీడియో చూస్తే అవును అని చెప్పాల్సి ఉంటుంది. వైసీపీ నుంచి ఎన్నికల ముందు టీడీపీలోకి జంప్ అయి సత్యవేడు టికెట్ ని సంపాదించుకున్న కోనేటి ఆదిమూలం మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటారని, తాను కూడా అలాగే బలి అయ్యానని అంటూ ఒక బాధిత మహిళా మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబుచ్చుకుంది.

తన మీద జూలై నెల 6న తేదీన ఒక హొటల్ లో లైంగిక దాడి చేశాడు అని కూడా సదరు మహిళ ఆరోపించారు. ఆ తరువాత మళ్ళీ ఆగస్ట్ 10న కూడా తనమీద అఘాయిత్యం చేశాదని ఆమె ఆరోపించారు. ఈ విషయం తమ భర్తకు చెబితే ఆయన పెన్ కెమెరా ఇచ్చారని దానితోనే మొత్తం ఎమ్మెల్యే రాసలీలను రికార్డు చేశాను అని ఆమె చెప్పారు. అంతే కాదు ఆయన ఆడది కనిపిస్తే చాలు కాటేయాలని చూసే రకం అని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చాలా కాలంగా వేధిస్తున్నాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తనపైన జరిగిన లైంగిక దాడిని కూడా ఆమె ఒక వీడియో రూపంలో సాక్ష్యంగా బయటపెట్టారు. ఆయన మీద కఠిన చర్యలు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. తాను టీడీపీని బాబుని ఇబ్బంది పెట్టడానికి ఈ ఆరోపణలు చేయలేదని తన బాధను చెప్పుకోవడానికే చేశానని ఆమె అంటున్నారు ఇక ఈ వీడియో సాక్ష్యాలను చంద్రబాబు లోకేష్ దృష్టికి కూడా తీసుకుని వచ్చాను అని అన్నారు.

ఇన్నాళ్ళూ పార్టీ తరఫున న్యాయం జరుగుతుందని భావించామని ఎలాంటి స్పందన లేకపోబట్టి మీడియా ముందుకు వచ్చామని అన్నారు. తాను టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకుని ఎమ్మెల్యే తన ఇంటి చుట్టూ మనుషులను పెట్టించి ప్రాణ హానికి కూడా తలపెడుతున్నారని ఆమె మరో ఆరోపణ చేశారు. మరో వైపు చూస్తే ఆమె భర్త కూడా మీడియాతో మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే నుంచి ప్రాణ హాని కూడా ఉందని రక్షించాలని కోరడం విశేషం.

ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు అని కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేకు తిరుపతిలో ఒక హొటల్ ఉందని అక్కడే ఆయన ఈ రకమైన రాసలీలలకు ఒక గదిని కూడా స్పెషల్ గా ఉంచుకున్నారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటిదాకా వైసీపీ ఎమ్మెల్యేల రాసలీలల మీదనే మీడియాలో వార్తలు వచ్చాయి. ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా రావడంతో కూటమి ఇరకాటంలో పడినట్లు అయింది. అయితే సదరు ఎమ్మెల్యే కూడా అయిదేళ్ళు వైసీపీలో చేసి వచ్చిన వారే పాత వాసనలు అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఈ రకంగా మహిళలను వేధించడం దారుణమనే అంటున్నారు.