''బ్రా' వేసుకోలేద‌ని బెదిరించారు''

ఓ మ‌హిళ బ్రా ధ‌రించ‌లేద‌నే కార‌ణంతో విమాన యాన సంస్థ సిబ్బంది ఆమెను బెదిరించారు.

Update: 2024-03-29 07:48 GMT

మ‌హిళ‌ల వ‌స్త్ర ధార‌ణ‌పై అమెరికాలో పెను వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఓ మ‌హిళ బ్రా ధ‌రించ‌లేద‌నే కార‌ణంతో విమాన యాన సంస్థ సిబ్బంది ఆమెను బెదిరించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల వేళ అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని బైడెన్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు విలువ ఇవ్వ‌డం లేద‌ని.. వాడుకుని వ‌దిలేసే వ‌స్తువుగా చూస్తోంద‌ని మండి ప‌డ్డారు.

ఇక‌, విష‌యంలోకి వెళ్తే.. ''నా వ‌య‌సు 38 ఏళ్లు. నేను బ్రా వేసుకోలేదని విమాన సిబ్బంది బెదిరించారు. విమానం నుంచి దించేస్తా మ‌న్నారు. ఇది న‌న్ను తీవ్రంగా హ‌ర్ట్ చేసింది.'' అని లిసా ఆర్చ్‌బోల్డ్ అనే మ‌హిళా ప్ర‌యాణికురాలు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఇది భార‌త్ లో జ‌రిగిన ఘ‌ట‌న కాదు. అమెరికాలోని లాస్ ఏంజెల స్‌లో జ‌రిగింది. అయితే.. ఒక‌వైపు మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతున్న అమెరికాలో చోటు చేసుకోవ‌డంతో అంత‌ర్జాతీయ మాన‌వ‌, మ‌హిళా సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. దీని పై జో బైడెన్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఏం జ‌రిగింది?

లిసా ఆర్చ్‌బోల్డ్ అనే మ‌హిళ జ‌న‌వ‌రిలో 'డెల్టా ఎయిర్‌లైన్స్' విమానంలో ప్ర‌యాణించారు. అయితే.. ఆమె బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్ టీషర్ట్‌తో బ్రా ధరించకుండానే ఫ్లైట్ ఎక్కారు. ఈ క్ర‌మంలో తన ఎద బయటకు కనిపించనప్పటికీ కవర్ చేసుకోవాలని మహిళా సిబ్బంది కోరారు. ''నేను మ‌హిళ‌న‌ని వారు భావించ‌లేదు. అందుకే న‌న్ను లక్ష్యంగా చేసుకుని సిబ్బంది అలా ప్రవర్తించారు. నాకు చాలా బాధ క‌లిగింది? వ్య‌క్తుల వ‌స్త్ర‌ధార‌ణ‌పై ఒక‌రి ఆధిప‌త్యం ఏంటి'' అని ఆమె ప్ర‌శ్నించారు.

డీజే అయిన ఆర్చ్‌బోల్డ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన వస్త్రధారణ ‘బహిర్గతం’, ‘ఆక్షేపణీయం’గా ఉందని, కాబట్టి అనుమతించబోమని డెల్టా సిబ్బంది తనకు చెప్పారని వివరించారు. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారని తెలిపారు.

ఈ వివక్షాపూరిత విధానంపై చర్చించేందుకు కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం కావాలని డిమాండ్ చేస్తూ ఆర్చ్‌బోల్డ్ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాసినట్టు న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ తెలిపారు. భద్రతాపరమైన ముప్పు ఉంటే తప్ప ప్రయాణికులను విమానం నుంచి దించకూడదని అమెరికా చట్టాలు చెబుతున్నాయని ఆల్రెడ్ తెలిపారు. అయితే.. ఇది వెలుగులోకి రావ‌డంతో బైడెన్ స‌ర్కారు ఇరుకున ప‌డింది. స‌ద‌రు విమానయాన సంస్థ‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News