తలపై కాల్చి, చేయి పగలగొట్టి, వేలు కత్తిరించి... సిన్వర్ పోస్టుమార్టం రిపోర్ట్!

అవును.. హమాస్ అధినేత, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతదేహానికి నిర్వహించిన పొస్టుమార్టంలో నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

Update: 2024-10-19 05:20 GMT

అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇది హమాస్ కు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు. ఈ క్రమంలో... సిన్వార్ మరణాన్ని హమాస్ కూడా ధృవీకరించింది. ఈ సమయంలో సిన్వర్ పోస్టుమార్టంలో సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి!

అవును.. హమాస్ అధినేత, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతదేహానికి నిర్వహించిన పొస్టుమార్టంలో నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు సిన్వర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు కీలక విషయాలు వెల్లడించారంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం... హమాస్ నాయకుడు సిన్వర్ తలపై తుపాకీతో కాల్చి చంపబడ్డాడు. ఇదే సమయంలో.. మరణానికి ముందు అతడి ముంజేయి నలుగగొట్టబడింది.. అప్పుడు తీవ్ర రక్తస్రావం జరిగింది. అంటే... తలకు బుల్లెట్ తగిలి చనిపోయే ముందు.. ఇతర తీవ్ర గాయాలకు సిన్వర్ గురయ్యాడన్నమాట.

ఈ విషయాలను ఇజ్రాయెల్ నేషనల్ ఫోరెన్సిక్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ చెన్ గుకెల్ వెల్లడించారు. ఇక అతని ముంజేయికి చిన్న క్షిపణి లేదా మరేదైన బలమైన వస్తువు తగిలి పగిలిపోయిందని చెప్పారు. దీనివల్ల తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. ఇక, అతడు మరణించిన 24 నుంచి 36 గంటల తర్వాత పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.

ఇది పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ఇజ్రాయెల్ మిలటరీకి అప్పగించగా.. వారు దాన్ని తెలియని ప్రదేశానికి తరలించి ఉండవచ్చని ఆయన తెలిపారు. అంతకంటే ముందు.. అతడిని గుర్తించడానికి డీ.ఎన్.ఏ. పరీక్ష కోసం ఇజ్రాయెల్ సైన్యం సిన్వర్ వేలిని కత్తిరించి పంపిందని సదరు వైద్యుడు చెప్పారు!

కాగా... అక్టోబర్ 17న హమాస్ అధినేత సిన్వర్ మరణాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించగా.. ఆ మరుసటి రోజు దాన్ని ధృవీకరించింది. అక్టోబర్ 7న సుమారు 1,200 మంది చంపబడిన ఘటనకు అతడే సూత్రదారి కావడంతో.. ఇజ్రాయెల్ ఇతడి కోసం తీవ్రంగా గాలించింది.. గాజాను జల్లెడపట్టింది.

సిన్వర్ మృతదేహం వద్ద ఒంటరిగా ఉన్న క్షణాల్లో...!:

హమాస్ అధినేత సిన్వర్ ను హతమార్చిన సంబరాలు ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో.. ఆ ఆపరేషన్ పాల్గొన్న ఇజ్రాయెల్ సైనికుడొకరు.. ఆ మృతదేహం వద్ద ఒంటరిగా ఉన్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అవును... సిన్వర్ మరణం అనంతరం అతడి మృతదేహం వద్ద ఒంటరిగా గడిపినప్పటి అనుభవాన్ని పంచుకున్నాడు లెఫ్టినెంట్ కల్నల్ ఈథమ్. ఇందులో భాగంగా... ఆ సమయంలో శిథిలమైన నగరాన్ని చూసినట్లు తెలిపాడు. ఆ సమయంలో సిన్వర్ మృతదేహాన్ని చూడగానే కాసేపు బాధ కలిగిందని అన్నారు.

దీనికి గల కారణం చెప్పిన ఈథమ్... అతడు ఒకప్పుడు ఏమీ తెలియని పిల్లవాడని.. కానీ, పెరిగే కొద్దీ చెడు మార్గాన్ని ఎంచుకున్నట్లు అనిపించిందని.. అయితే.. అతడి మరణం ప్రపంచానికి ఎంతో మేలని అన్నారు. ఈ సందర్భంగా తాము గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా.. సిన్వర్ శరణార్థి శిభిరంలో జన్మించిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News