మంత్ కి ఒక వైసీపీ లీడర్ సెన్సేషనల్ న్యూస్.. ఏంటి ఈ గోల ?

నిజానికి చూస్తే ఇవన్నీ పాతవే. కానీ ఇపుడు మీడియాకు సీరియల్ స్టోరీస్ గా మారుతున్నాయి.

Update: 2024-08-30 06:39 GMT

వైసీపీకి భారీ ఓటమితో తల బొప్పి కట్టింది. అయితే దానితో పాటుగా అన్నట్లుగా మోరల్ గ్రౌండ్స్ లో ఆ పార్టీకి పూర్తిగా ఇరకాటంలో పెట్టేలా సంఘటనలు వరసబెట్టి సాగుతున్నాయి. ఇవన్నీ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి చూస్తే ఇవన్నీ పాతవే. కానీ ఇపుడు మీడియాకు సీరియల్ స్టోరీస్ గా మారుతున్నాయి.

దాంతో డీబేట్ల మీద డిబేట్లు పెడుతూ మీడియా వైసీపీని బదనాం చేస్తూంటే సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు వైసీపీతో ఒక చెడుగుడు ఆడుగుంటున్నారు. ఇదంతా ఈ రోజుది కాదు అని కూడా చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు మొదలైన గోల ఇది.

ఒక మంత్రి అప్పట్లో అరగంట అన్నారని, మరో మాజీ మంత్రి గంట అని ఎవరినో ఫోన్ చేసి మాట్లాడారని మీడియా తెగ గోల పెట్టింది. ఆనాడే కనుక వైసీపీ అధినాయకత్వం వీటి మీద పూర్తి స్థాయి విచారణ చేసి తమ పార్టీ వారికి గట్టిగా కాషన్ ఇచ్చి ఉంటే ఇప్పటికి అంతా సర్దుకునేది అని అంటున్నారు.

అలా చేయకుండా సైలెంట్ గా ఉండబట్టే అవి మితిమీరుతున్నాయి. పాత కేసులు కూడా కొత్త కేసులు మాదిరిగా బయటకు వచ్చి వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వైసీపీలో చూస్తే కనుక ఒక ఎంపీ గోరంట్ల వీడియో అంటూ అప్పట్లో విపరీతంగా ప్రచారం చేశారు.

అది కూడా వైసీపీ నైతికతను దెబ్బతీసేలా సాగింది. అదే విధంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండటం ఆయన భార్య కుమార్తె ఆయన ఇంటి ముందే ఆందోళన చేయడం ఇవన్నీ గత నెల అంతా మీడియానే పూర్తి అటెన్షన్ లో పెట్టేశాయి. వాటి మీదనే చర్చలు వేడిగా సాగాయి.

ఈ మధ్యలో మరో ఎమ్మెల్సీ అనంత బాబు ఎపిసోడ్. ఆయన కూడా అసభ్యంగా మాట్లాడారని ఆయన వీడియోలను ఏవేవో మీడియా ప్రచారం చేసింది. ఇక లేటెస్ట్ టాపిక్ ఏంటి అంటే ముంబైకి చెందిన ఒక నటితో వైసీపీ నేతకు పరిచయాలు ప్రేమలు అవి కాస్తా వేధింపులు బెదిరింపులు కేసుల దాకా వెళ్ళాయని వైసీపీ అధికార బలంతో ఆ కేసుని టర్న్ తిప్పి సదరు సినీ నటిని ఆమె కుటుంబాన్ని బాధితురాలిగా చేసారని మరో ఎపిసోడ్ ముందుకు వచ్చింది.

ఇవన్నీ చూసినపుడు వైసీపీ ఎంతలా నైతిక పతనం చెందుతోందో అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మీడియా సమావేశంలోనూ వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో ఇలాంటివి జరుగుతూంటే అధ్యక్షుడిగా ఉన్న వారు రెస్పాండ్ కారా. ఎందుకు మౌనం పాటిస్తారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని ఆయన జగన్ మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.

అయితే దానికి మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే కౌంటర్ వేశారు అదెప్పుడో 2014లో వైసీపీ తరఫున అసెంబ్లీకి నామినేషన్ వేసి ఆ తరువాత మా పార్టీకే సంబంధం లేని వ్యక్తి ఎవరో బాలివుడ్ నటితో వివాదం పెట్టుకుంటే ఆ బురద మాకు తెచ్చి పూస్తారా అని ఫైర్ అయ్యారు. అంతే కాదు ఆ నటి మీద కేసులు కానీ ఆ ఘటనలు కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు జరిగాయని, అపుడు ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.

కొందరు ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టడానికి ప్రభుత్వం ఈ కేసుని ముందుకు తెచ్చిందని కూడా పేర్ని నాని అన్నారు. మొత్తానికి ఈ విషయంలో డిపెండ్ చేసుకోలేక వైసీపీ సతమతం అవుతున్నదని అంతా అంటున్నారు. ఒక వ్యక్తికైనా వ్యవస్థకైనా సంస్థకైనా నైతికత చాలా ముఖ్యం.

అలా ఉన్నట్లుగా బిల్డప్ అయినా ఇవ్వాలి. రచ్చ కాకుండా చూసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం అదే పనిగా దొరికిపోతోంది. ఇలాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక జరుగుతోందా లేక ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలు అని అధినాయకత్వం చూసీ చూడనట్లుగా వదిలేయడం వల్ల జరుగుతోందా అన్నదే చర్చగా ఉంది.

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఎవరైనా పబ్లిక్ లోకి వస్తే వారి పర్సనల్ అంటూ ఏమీ ఉండదు, అందువల్ల పార్టీలో క్రమశిక్షణా చర్యలు అన్నవి వైసీపీలో మొదట్లోనే గట్టిగా తీసుకుని ఉంటే ఈ సీన్ వచ్చేది కాదని అనేవారూ ఉన్నారు.

నిజం చెప్పాలంటే ఈ రోజులలో ఎవరూ పత్తిత్తులు కారు. కానీ మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకుని మాత్రం తిరగరు. అలా వైసీపీ నేతలే రోడ్డున పడిపోతున్నారు. అల్టిమేట్ గా వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సోషల్ మీడియాలో అయితే వైకాపా పార్టీ కాదు వైకామా పార్టీ అని ట్రోల్స్ చేస్తున్నారు అంటే సామాన్య జనానికి ఆ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకతను పెంచడానికి ఇదంతా చేస్తున్నారో అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

Tags:    

Similar News