జంబో జెట్ తో వైసీపీ టార్గెట్!
వైసీపీ తాజాగా పీఏసీ ని నియమించింది. ఇందులో ప్రాంతాలు సామాజిక రాజకీయ సమీకరణలు అన్నీ చూసుకుని అందరికీ చోటు కల్పించేసరికి అది కాస్తా జంబో జెట్ అయింది.;

వైసీపీ తాజాగా పీఏసీ ని నియమించింది. ఇందులో ప్రాంతాలు సామాజిక రాజకీయ సమీకరణలు అన్నీ చూసుకుని అందరికీ చోటు కల్పించేసరికి అది కాస్తా జంబో జెట్ అయింది. శాశ్వత ఆహ్వానితులతో కలుపుకుని చూస్తే కనుక దాదాపుగా యాభై మంది దాకా మెంబర్స్ లెక్క తేలుతుంది.
ఇక ఇందులో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. రాజకీయంగా యాక్టివ్ కాని వారికి కూడా తెచ్చి పదవులు ఇచ్చారు. అలాగే పార్టీ పరంగా పెద్దగా కనిపించని వారికి ప్రజాదరణ అంతగా లేని వారికి కూడా కీలక పదవులు ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
ఈ జంబో జెట్ కమిటీతో వైసీపీ అధినాయకత్వం అధికారం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది అని అంటున్నారు. అయితే పార్టీలో అంతా కష్టపడితేనే అది సాధ్యమని అంటున్నారు. వైసీపీ అయితే అనేక అంచెలలో పదవులు క్రియేట్ చేసి చాలా మందికి ఇస్తోంది. అయితే ఆ పదవులు అందుకున్న వారు పనిచేస్తున్నారా అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది.
మరో వైపు చూస్తే పీఏసీ కమిటీ వైసీపీకి అత్యున్నత విధాయక మండలిగా ఉంటుంది. మరి పీఏసీ తీసుకునే నిర్ణయాలు పార్టీకి శిరోధార్యం గా ఉంటాయి. అయితే పీఏసీ సమావేశాలు కూడా ఎక్కువగా నిర్వహించాలన్నది కూడా పార్టీలో చర్చ సాగుతోంది.
అధినాయకత్వానికి పార్టీకి దిశా నిర్దేశం చేసే విధంగా పీఏసీ ఉంటుందని చెబుతున్నారు. అలాంటపుడు పీఏసీ అనేక అంశాలపైన చర్చించాల్సి ఉందని అంటున్నారు. ఇక వైసీపీని బలోపేతం చేసేందుకు సీనియర్లు ఇచ్చే సలహాలు సూచనలు కూడా పార్టీ పెద్దలు పట్టించుకోవాలని అవసరం అయిన సందర్భాలలో పాటించాలని అంటున్నారు.
టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి అత్యున్నత విధాన మండలిగా పొలిట్ బ్యూరో ఉంది. ఎన్నో కీలకమైన నిర్ణయాలను పొలిట్ బ్యూరోలో చర్చించి తీసుకుంటారు. అలాగే పీఏసీని కూడా మరింత క్రియాశీలం చేయాలని వైసీపీ నేతలు కోరుతున్నారని అంటున్నారు.
ఇంకో విషయం చూసుకుంటే కనుక పార్టీలో పనిచేసే వారికి నిబద్ధతో ఉన్న వారికే పదవులు అవకాశాలు ఇస్తే బాగుంటుంది అన్నది కూడా ఉంది. అలాగే సీనియర్లకు పెద్ద పీట వేయడం సబబుగానే ఉన్నా కూడా యువతకు సైతం అగ్ర స్థానం ఇస్తేనే పార్టీకి కొత్త నీరు చేరుతుందని జనాలతో కనెక్షన్ మరింతగా పెరుగుతుందని అంటున్నారు.
అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని పీఏసీ పునర్వ్యవస్థీకరించారు. అయితే పీఏసీలో ఈ కూర్పు అనుభవానికి పెద్ద పీటగా చెబుతున్నారు. అవతల వైపు చూస్తే టీడీపీలో యువతరానికి అవకాశం ఇస్తున్నారు. మారుతున్న కాలానికి తగిన రాజకీయం చేయాలీ అంటే వైసీపీలో మరిన్ని మార్పులు అవసరమని అంటున్నారు. జెంబో జెట్ టీం ఎంతవరకూ వైసీపీకి పూర్వ వైభవం తీసుకుని వస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.