వైసీపీ కొత్త కొత్తగా!

రాజకీయాల్లో ఎపుడూ కొత్తగానే ఉండాలి. కొత్తదనం కనిపించాలి. వైసీపీ విపక్షంలో ఉంది. అధికారం చూసింది. మళ్లీ విపక్షం లోకి వచ్చేసింది. దాంతో వైసీపీ మళ్ళీ మొదటి నుంచి మొదలెడుతోంది.

Update: 2024-12-11 16:30 GMT

రాజకీయాల్లో ఎపుడూ కొత్తగానే ఉండాలి. కొత్తదనం కనిపించాలి. వైసీపీ విపక్షంలో ఉంది. అధికారం చూసింది. మళ్లీ విపక్షం లోకి వచ్చేసింది. దాంతో వైసీపీ మళ్ళీ మొదటి నుంచి మొదలెడుతోంది.

ఎక్కడ ఆగిపోయామో అక్కడ నుంచే అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ అడుగులు వేస్తోంది. వైసీపీ అధికార వైభోగంలో ఉన్నపుడు సొంతంగా ఆఫీసులు ప్రతీ జిల్లాలో నిర్మించుకుంది. అలా విశాఖకు శివారున మధురవాడ దగ్గర బహు చక్కని ఆఫీసుని నిర్మించుకుంది.

అయితే ఆ ఆఫీసు తుది మెరుగులలో ఉండగా వైసీపీ అధికారం నుంచి దిగిపోయింది. అధికారంలో ఉన్నపుడు కళకళలాడిన పార్టీ ఆఫీసు సహజంగానే బోసిపోయింది. అందరికీ దూరాలూ భారాలూ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి.

విశాఖకు దూరంగా ఆఫీసు అంటే ఎవరూ రావడం లేదు. దాంతో మళ్ళీ సిటీలోనే ఒక కొత్త ఆఫీసుని ప్రారంభించారు. బుధవారం వైసీపీ కొత్త జిల్లా ఆఫీసుని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ప్రారంభించారు. పార్టీ ముఖ్యులు అంతా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక నుంచి ఇక్కడ నుంచి పార్టీని పరుగులు పెట్టిస్తామని నేతలు అంటున్నారు

కొత్త ఆఫీసులోకి ఎంటర్ కాగానే ఈ నెల 13 నుంది వైసీపీ ఆందోళనా కార్యక్రమాలను సంబంధించి చర్చించారు. అంటే జనంలో ఉంటూ జనం సమస్యల మీద పోరాడేందుకు కొత్త కొత్తగా రంగం సిద్ధం చేసుకున్నారన్న మాట. ప్రతిపక్షం అంటే జనంలోనే ఉండాలి. వైసీపీకి ఆ విషయం తెలియనిది కాదు. అటు పార్టీ జనాలను ఇటు సాధారణ జనాలను కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలోనే వైసీపీ విజయం దాగుంది.

Tags:    

Similar News