అమరావతిలో క్రికెట్ స్టేడియం.. లోకేష్ ను ఆడుకుంటున్న వైసీపీ!
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... లోకేష్ చెప్పిన ఓ విషయంపై వైసీపీ నెట్టింట ట్రోలింగ్స్ మొదలుపెట్టింది. అదే... అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం!
ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని.. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై నుంచి బయట పడుతున్నామని.. అందువల్లే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కూటమి నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం చెబుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క మంత్రి లోకేష్ మాట్లాడుతూ... సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఏప్రిల్, మే నుంచి అమలు చేస్తామని.. త్వరలో మంగళగిరిలో లీడ్ స్కూల్స్ రాబోతున్నాయని.. పీజీ విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. అంటే... సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ మినహా మిగిలినవి ఒక ఏడాది పాటు ప్రజలు నష్టపోయినట్లే అనే చర్చ మొదలైంది.
ఇలా కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన అత్యంత కీలక హామీలైన సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలుకు నోచుకోని పరిస్థితి. ఇదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీ కూడా ఇప్పటికీ నోటిఫికేషన్ రాకపోవడం మరీ దారుణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా... సీఎం తొలి సంతకానికి ఉన్న విలువ ఈ సందర్భంగా చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు. ఇలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం కూడా అమలుకు నోచుకోలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... లోకేష్ చెప్పిన ఓ విషయంపై వైసీపీ నెట్టింట ట్రోలింగ్స్ మొదలుపెట్టింది. అదే... అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం!
అవును... అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నామని.. అందుకు సహకరించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంగీకరించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇటీవల భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు తాను దుబాయ్ వెళ్లాలని చెప్పిన ఆయన.. అక్కడ భారత జట్టుకు మద్దతు తెలిపానని అన్నారు.
ఇదే సమయంలో.. ప్రధానంగా స్టేడియంలో సీటింగ్ ఎలా ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఎలా నిర్మించాలి అనే విషయాలను పరిశీలించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్ లో ఉందని.. అమరావతిలో కూడా అదే స్థాయిలో నిర్మించనున్నట్లు తెలిపారు. అదే విధంగా.. అమరావతిలో స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
దీంతో.. నెట్టింట వైసీపీ నుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. మింగడానికి మెతుకు లేదని చెబుతూ.. మీసాలకు సెంపగి నూనె కబుర్లు అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500, మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీలు అలానే ఉన్నాయి.
అవి ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. వీటితో పాటు 100కి పైనే హామీలున్నాయని.. అవన్నీ గాలికి వదిలేసి.. వాటిపై స్పందించకుండా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా... అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ వంటి మాటలేలా లోకేష్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
వీలైనంత త్వరగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గురించి ఆలోచించొచ్చని వైసీపీతో పాటు ప్రజలు కోరుతున్నారు.