భారీ ఓటమిలోనూ టీడీపీని వెనక్కి నెట్టి వైసీపీ
అలాంటిది చరిత్రలో ఎన్నడూ చూడని 11 నంబర్ తో వైసీపీని ఓటమి వెక్కించింది.
ఒక వైపు భారీ ఓటమి వైసీపీ వెన్ను విరిచింది. పార్టీ పునాదులు కదిలించేసింది. పార్టీ మొత్తం పానిక్ సిట్యువేషన్ లోకి వెళ్ళిపోయిన నేపధ్యం ఉంది. ఓటమి అనుకున్నా మరీ ఇంతలానా అన్న ఫీలింగ్ తో ఈ రోజుకీ వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైసీపీ పన్నెండేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదగడమే కానీ కిందకు దిగిన సందర్భాలు లేవు. అలాంటిది చరిత్రలో ఎన్నడూ చూడని 11 నంబర్ తో వైసీపీని ఓటమి వెక్కించింది.
దాంతో అంతర్మధనంతో నేతలు ఉన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా లోక్ సభ ఎన్నికల్లో దేశంలో వివిధ రాజకీయ పార్టీలు పొందిన ఓట్ల శాతాన్ని రిలీజ్ చేసింది. అందులో టీడీపీని వెనక్కి నెట్టి వైసీపీ టాప్ ఫైవ్ ప్లేస్ లోకి రావడం సరిగ్గా ఈ సమయంలో ఊరటను ఇచ్చే పరిణామం అని అంటున్నారు.
దేశంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పొందిన పార్టీల జాబితా ఈసీ వివరాల ప్రకారం చూస్తే మొదటి అయిదు స్థానాలలో టీడీపీకి చోటు లేకుండా పోయింది. ఇక దేశంలోనే 240 దాకా లోక్‌సభ స్థానాలను గెలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా గతం కంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 21.96 ఓట్ల శాతంతో రెండో స్థానాన్ని అందుకుంది.
ఇక మూడవ ప్లేస్ ఎవరిది అంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని మూడవ వంతు సీట్లకు పరిమితం చేసిన సమాజ్ వాది పార్టీ అని చెప్పాలి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ 4.58 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. అలాగే చూస్తే కనుక 4.37 శాతం ఓట్లతో మరో పార్టీ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక అయిదవ స్థానంలో వైసీపీ నిలవడం విశేషం.
వైసీపీ తాజా ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయినా కూడా ఈసీ లెక్కల ప్రకారం 2.06 ఓట్ల శాతంతో వైసీపీ టాప్ ఫైవ్ లో ఉంది. ఇది నిజంగా వైసీపీకి ఈ సమయంలో ఎంతో బూస్ట్ ఇచ్చే న్యూస్ గా చెబుతున్నారు. ఇక రాజకీయంగా విశ్లేషించుకుంటే తొలి నాలుగు ప్లేస్ లలో ఉన్న పార్టీలు అన్నీ కూడా పొత్తులు పెట్టుకుని కూటములు కట్టి ఆ ప్లేస్ ని సాధించాయి.
కానీ వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఈ ఓట్ల శాతం తెచ్చుకోవడం దేశంలోనే టాప్ ఫైవ్ గా ఉండడం గ్రేట్ అని అంటున్నారు. ఇక వైసీపీ తరువాత ప్లేస్ లో 1.98 శాతంతో తెలుగు దేశం పార్టీ మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకోవడం ఒక విధంగా ఆలోచింపచేసెదిగా ఉంది అని అంటున్నారు.
టీడీపీ ఈ ఎన్నికల్లో కూటమి కట్టింది. ఏపీలోబీజేపీ, జనసేనతో జతకట్టిన టీడీపీకి ఈ స్థాయిలో తక్కువ ఓట్ల శాతం రావడం మీద చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఈసీ విడుదల చేసిన ఈ నివేదికతో వైసీపీలో కొత్త ఆనందం వ్యక్తం అవౌతోంది.
వైసీపీ అయితే తమ ఓటమిలోనూ గెలుపు ఉందని అంటోంది. ఎవరితోనూ పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగి నలభై శాతం ఓట్ షేర్ ని ఏపీ ఎన్నికల్లో సాధించామని ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ ఓట్ల షేర్ కి టాప్ ఫైవ్ ర్యాంక్ ఇవ్వడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ కూటమికి తమ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని కూడా చెబుతోంది. రానున్న రోజులలో మరోసారి అధికారంలోకి వస్తామన్న వైసీపీ ధీమాకు ఈసీ లెక్కలు ఇపుడు కొత్త ధైర్యం ఇచ్చాయని అనుకోవాల్సి ఉంది.