బాబు ఓడితే హైదరాబాద్ వెళ్తారు.. అధికారులు ఇక్కడే ఉంటారు: వైసీపీ వార్నింగ్
నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూ రు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ సహా రెవెన్యూ అధికారులను ఉద్దేశించి వైసీపీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు చెప్పినట్టు చేస్తే.. రేపు ఇబ్బందుల్లో పడతారని.. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. అంతేకాదు.. ప్రస్తుత సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే.. హైదరాబాద్ వెళ్లిపోతారని.. కానీ, ఇక్కడ పనిచేసే అధికారులు ఇక్కడే ఉంటారని.. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు.
నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూ రు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చా రు. ఈ సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జైలకు వెళ్లి.. పిన్నెల్లికి ఆహ్వానం పలి కారు. అనంతరం.. కొద్దిసేపు కారులోనే కూర్చుని ఇద్దరూ ముచ్చడించుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై నిప్పులు చెరిగారు.
లేనిపోని కేసులతో పార్టీ నేతలను అధికారులు, పోలీసులు వేదిస్తున్నారని కాకాణి చెప్పారు. భూకబ్జాలు, ఇసుక పేరుతో అర్ధరాత్రి పూట స్టేషన్లకు తీసుకువెళ్లి కూర్చోబెడుతున్నారని.. వేధింపులకు గురి చేస్తున్నా రని.. కొందరిపై కేసులు కూడా పెడుతున్నారని అన్నారు. ఇదంతా చంద్రబాబు చేయిస్తున్నారని ఆరోపిం చారు. అయితే.. చంద్రబాబు చెప్పినట్టు చేసే ప్రతి అధికారీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రేపు వైసీపీ అధికారంలోకివస్తుందని చెప్పారు.
అప్పుడు ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్న అధికారులను వదిలేది లేదన్నారు. చంద్రబాబు అప్పుడు ఇక్కడ ఉండబోరని.. హైదరాబాద్‌లో ఉంటారని. కానీ, అధికారులు మాత్రంఏపీలోనే ఉంటారన్న విషయా న్ని గుర్తు చేసుకోవాలని కాకాణి సూచించారు. కాగా.. అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా.. ``మధుసూదన్‌రావు`` అంటూ ఓ పోలీసు అధికారిని ఇలానే హెచ్చరించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన చెప్పిన మాటనే ఇప్పుడు కాకాణి గుర్తు చేయడం గమనార్హం.