కొత్త ఏడాదిలో విడుదలయ్యే వైసీపీ తదుపరి జాబితా ఇదేనా?
ఈ నేపథ్యంలో తాజాగా ఒక జాబితా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతోంది. పార్టీ విశ్వసనీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ జాబితా బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అధికార వైసీపీ ఇంఛార్జిల తదుపరి జాబితా గురించి తెలిసిందే. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం రెండో రోజున (జనవరి 2న) తదుపరి జాబితా వెల్లడి అవుతుందని చెబుతున్నారు. ఇప్పటివకే 11 స్థానాల్లో మార్పులు చేర్పులను ప్రకటించిన వైసీపీ అధినేత.. పలువురు సిట్టింగులకు షాక్ ఇవ్వటం తెలిసిందే. తదుపరి జాబితాను జనవరి 2న విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఒక జాబితా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతోంది. పార్టీ విశ్వసనీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ జాబితా బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ జాబితాలో ఉన్న ఇంఛార్జిలను చూస్తే.. పలు స్థానాల్లో ఇప్పటికు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులకు ఇంఛార్జి పదవుల్ని కట్టబెట్టినట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే.. మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో రాజకీయ వారసులు ఎన్నికల సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలువురు సిట్టింగులను మార్చిన సీఎం జగన్.. విజయమే లక్ష్యంగా ఇంచార్జీలను ఎంపిక చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం కొందరి విషయంలో మాత్రం యథాతధ స్థితిని కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు. వీరిలో సత్తెనపల్లి అంబటి రాంబాబు.. నగరి ఆర్కే రోజా.. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి.. అనంతపురం వెంకటరామిరెడ్డి.. మైలవరం వసంత క్రిష్ణ ప్రసాద్ ల పేర్లు వినిపిస్తున్నాయి.
తొలి విడత జాబితాను ప్రకటించిన తర్వాత మార్పులు చేర్పులకు కాస్తంత విరామం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తు నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఆధారంగా తుది ఎంపిక చేస్తారని చెబుతున్నారు. తాజాగా సర్క్యులేట్ అవుతున్నజాబితాలో నిజం ఎంతన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే సరి.
విశాఖ నార్త్ : కే కే రాజు
శ్రీకాకుళం : ధర్మాన ప్రసాద్
మాడుగుల: బూడి ముత్యాల నాయుడు
రాజమండ్రి సిటీ: మార్గాని భరత్
నర్సీపట్నం: పెట్ల ఉమాశంకర్ గణేష్
ఆమదాలవలస : తమ్మినేని సీతారాం
నర్సనపేట : ధర్నాన కృష్ణ దాస్
పాతపట్నం : రెడ్డి శాంతి
పలాస : అప్పలరాజు సిదిరి
తుని: దాడిశెట్టి రాజా
జగ్గంపేట: తోట నరసింహం
పెద్దాపురం: దావులూరి దొరబాబు
పత్తిపాడు : వరుపులు సుబ్బారావు
పిఠాపురం: వంగా గీత
ముమ్మిడివరం : పొన్నాడ సతీష్
భీమవరం : గ్రంధి శ్రీనివాస్
మంగళగిరి: గంజి చిరంజీవి
తణుకు : కారుమూరి నాగేశ్వరరావు
నూజివీడు : మేక వెంకట ప్రతాప్ అప్పారావు
కైకలూరు : దూలం నాగేశ్వరరావు
తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
విజయవాడ ఈస్ట్ : దేవినేని అవినాష్
మచిలీపట్నం : పేర్ని కిట్టు
గన్నవరం : వల్లభనేని వంశీ
గుడివాడ: కొడాలి వెంకటేశ్వర రావు
తెనాలి : అన్న బత్తుని శివకుమార్
వినుకొండ : బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల : కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి
మాచర్ల : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
కోవూరు - నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి
సర్వేపల్లి: కాకాని గోవర్ధన్ రెడ్డి
కందుకూరు : మహీధర్ రెడ్డి
ఆత్మకూరు : మేకపాటి విక్రం రెడ్డి
ఉదయగిరి : మేకపాటి రాజగోపాల్ రెడ్డి
తిరుపతి : భూమన అభినయ రెడ్డి
చంద్రగిరి: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
వెంకటగిరి : నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి
సత్యవేడు : నారాయణస్వామి లేదా కోనేటి ఆదిమూలం
పుంగనూరు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కుప్పం: కె. ఆర్. జె భరత్
జమ్మలమడుగు: వైయస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు : ఆర్ శివ ప్రసాద్ రెడ్డి
పులివెందుల : వైయస్ జగన్మోహన్ రెడ్డి
డోన్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పాణ్యం: కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు
మంత్రాలయం: వై బాలనాగిరెడ్డి
ఆదోని :వై సాయి ప్రసాద్ రెడ్డి
రాప్తాడు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
తాడిపత్రి : కేతిరెడ్డి పెద్దారెడ్డి
పెనుగొండ: కె.వి ఉషశ్రీ చరణ్
ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
బాపట్ల: పిన్నెల్లి వేమా రెడ్డి