వైసీపీ నుంచి ఇద్దరు ఐఏఎస్ లు పోటీకి రెడీ...?

ఈయన కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రాధాన్యత కలిగిన పోస్టింగులలో ఉంటూ వస్తున్నారు. ఈయన సైతం ఎంపీ కావాలని చూస్తున్నారు.

Update: 2023-10-27 03:15 GMT

అధికార వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు ఐఏఎస్ లు రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆ ఇద్దరినీ కొత్త ముఖాలుగా ఫ్రెష్ గా జనంలో ఉంచి మరోసారి హిట్ కొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కలికాల వళవన్. ఈయన స్వతహాగా తమిళనాడు వాసి. అయితే ఏపీలో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నారు. కీలకమైన శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ వస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది. దాంతో ఆయనను ఈసారి ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయించాలని వైసీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. తిరుపతిలో ఎక్కువగా తమిళ ఓటర్లు ఉన్నారు. పైగా కలికాల వళవన్ తిరుపతిలో పనిచేసిన టైం లో అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

పైగా ఆయన బలమైన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో అన్ని విధాలుగా కలసివస్తుందని ఈ సీనియర్ ఐఏఎస్ కి వైసీపీ ఎంపీ పోస్టుకు ఓకే చెప్పేసింది అని అంటున్నారు. ఇక మరో సీనియర్ ఐఏఎస్ గా విజయకుమార్ ఉన్నారు. ఈయన కూడా ముఖ్యమైన ప్రభుత్వ శాఖలను చూసే నిబద్ధత కలిగిన అధికారి.

ఈయన కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రాధాన్యత కలిగిన పోస్టింగులలో ఉంటూ వస్తున్నారు. ఈయన సైతం ఎంపీ కావాలని చూస్తున్నారు. ఈయన రాజకీయాల్లోకి వస్తాను అంటే వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని అంటున్నారు. ఈ సీనియర్ ఐఏఎస్ కి బాపట్ల నియోజకవర్గం మీద మక్కువ ఎక్కువగా ఉంది అని అంటున్నారు.

అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నందిగం సురేష్ ఉన్నారు. మరి ఆయన్ని మార్చి ఇవ్వాలి. సురేష్ కి కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉంది. అయితే ఆయన తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం ఆయనను ప్రకాశం జిల్లాలోని యెర్రగొండపాలెం నుంచి పోటీ చేయమని కోరుతోంది అని అంటున్నారు.

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. మరి ఈ సురేష్ ని మార్చి ఆ సురేష్ ని తేవడం వరకూ ఓకే కానీ ఆదిమూలపు సురేష్ కి ఎక్కడ నుంచి సీటు ఇస్తారు అన్నది తేలాల్సి ఉంది. అంతే కాదు తిరుపతి ఉప ఎన్నికలో గెలిచిన ఎంపీ గురుమూర్తికి ఎక్కడ పొలిటికల్ రీప్లేస్ మెంట్ ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇద్దరు ఐ ఏ ఏస్ లకు మాత్రం ఈసారి వైసీపీ ఎంపీగా పోటీ చేసే చాన్స్ ఇవ్వబోతోంది అని అంటున్నారు. అలా మళ్లీ కీలకమైన ఎంపీ సీట్లలో తిరుగులేని పాగా వేయలని చూస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News