నెటిజన్లు కోరుకుంటున్న నిబంధన తెస్తున్న యూట్యూబ్!

యూట్యూబ్ లో జనాలకు ఉన్న మిగిలిన సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే... మరో అతిపెద్ద సమస్య ఉందని అంటారు.

Update: 2024-12-21 04:04 GMT

యూట్యూబ్ లో జనాలకు ఉన్న మిగిలిన సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే... మరో అతిపెద్ద సమస్య ఉందని అంటారు. అదే... తప్పుదు థంబ్ నైల్స్, ఫేక్ టైటిల్స్! కనిపించే థంబ్ నైల్స్ కు, పెట్టే టైటిల్ కు లోపల ఉండే కంటెంట్ కూ ఏమాత్రం పొంతనలేకుండా వీడియోలు పోస్ట్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వారికి తాజాగా యూట్యూబ్ చెక్ పెట్ట బోతోంది.

అవును... ఎక్కువ వ్యూస్ కావాలే ఉద్దేశ్యంతో.. ధమ్మున్న కంటెంట్ పెట్టలేకో ఏమో కానీ... కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూవర్స్ ని తప్పుదోవ పట్టించేలా థంబ్ నైల్స్, టైటిల్స్ పెడుతుంటాయి. తీరా వీడియోపై క్లిక్ చేస్తే... బయట కంపించే టైటిల్ కు లోపల ఉన్న కంటెంట్ కూ ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ తరహా అనుభవాలు చాలా మందికే ఉంటాయి!

దీంతో... యూజర్ తన కోపాన్ని కామెంట్ సెక్షన్ లో చూపించి క్లోజ్ చేస్తాడు. మరికొంతమంది కామెంట్ సెక్షన్ ని డిజబుల్ చేస్తే... ఆ ఛానల్ ని రిపోర్ట్ చేసి కోపం తగ్గించుకుంటారు. ఇందులో ప్రధానంగా రాజకీయ నాయకుల స్టేట్ మెంట్స్, సినిమా నటీనటుల పర్సనల్ లైఫ్ కు సంబంధించినవి ఉంటుంటాయని అంటారు.

ఈ నేపథ్యంలో యూట్యూబ్ చర్యలకు సిద్ధం కాబోతుంది. ప్రధానంగా బ్రేకింగ్ న్యూస్ అని, సంచలనం అని, మీకు తెలుసా అని రకరకాల క్లిక్ బైట్ టైటిల్స్, థంబ్ నైల్స్ వాడం మరీ ఎక్కువైన నేపథ్యంలో దీన్ని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని యూట్యూబ్ నిర్ణయించుకుంది. ఇలా తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్ లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.

ఇందులో భాగంగా... త్వరలోనే కొత్త నిబంధనలు తేనున్నామని.. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో... నిబంధనలు పటించని వారి వీడియోలను తొలుత డిలీట్ చేయగా.. మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘిస్తె ఆ ఛానల్ ని స్ట్రైక్ వేస్తుంది. దీంతో... ఈ నిబంధనపై యూజర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News