యూట్యూబ్ రూల్స్ అతిక్రమించడంలో భారత్ టాప్... డిటైల్స్ ఇవే!
అవును... యూట్యూబ్ కమ్యునిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించడంలో భారత్ టాప్ ప్లేస్ లో ఉందని తెలుస్తుంది
గూగుల్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ ప్రకారం... తన కమ్యునిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 20223 మధ్యకాలంలో భారత్ లో ఏకంగా 2.25 మిలియన్ల (22, 54, 902) వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఇలా యూట్యూబ్ వీడియోలు తొలగించిన జాబితాలో అమెరికా, రష్యా కంటే భారత్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం! ఈ జాబితాలో 12,43,871 వీడియోల తొలగింపుతో సింగపూర్ రెండో స్థానంలో ఉంది.
అవును... యూట్యూబ్ కమ్యునిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించడంలో భారత్ టాప్ ప్లేస్ లో ఉందని తెలుస్తుంది! ఇందులో భాగంగా... భారత్ నుంచి 2.25 మిలియన్లు, సింగపూర్ నుంచి 1.24మిలియన్ల వీడియోలను తొలగించినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో 7,88,354 వీడియోల తొలగింపుతో అమెరికా మూడోస్థానంలో ఉండగా... 7,70,157 వీడియోలతో ఇండోనేషియా.. 5,16,629 వీడియోలతో రష్యా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఇలా ఈ 2023 అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో యూట్యూబ్ సుమారు 90,12,232 వీడియోలను తొలగించినట్లు చెబుతుంది! అయితే వీటిలో సుమారు 96శాతం వీడియోలను వినియోగదారులు కాకండా.. తమ వ్యవస్థలే గుర్తించినట్లు యూట్యూబ్ తెలిపింది. వీటిలో ప్రధానంగా... పిల్లల భద్రత, హింసాత్మక కంటెంట్, న్యూడిటీ, తప్పుడు సమాచారం, లైంగిక కంటెంట్ వంటి పలు రకాల ప్రమాదకరమైన కంటెంట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో... ఏదైనా ఛానెల్ 90 రోజుల వ్యవధిలో మూడు కమ్యునిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. తీవ్రమైన దుర్గినియోగానికి పాల్పడితే అవి నిషేదించబడతాయని చెబుతున్నారు. మరోపక్క ఇటీవల యూట్యూక్ సరికొత్త టూల్ ని పరిచయం చేస్తోంది. దీనిప్రకారం... మనం చూస్తున్న వీడియో ఒరిజినలా.. లేక, కాపీ కంటెంటా అనేది తెలిసేలా చేస్తుంది!! ఈ సమయంలో స్పందించిన యూట్యూబ్... వినియోగదారులకు సురక్షితమైన వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం ను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది!