రూ.2 కోట్ల ఉద్యోగం వదిలి రూ.8 కోట్లు ..!
కానీ తన నుండి మరింత ఎక్కువ మందికి తన వల్ల ప్రయోజనం కలగాలని భావించింది. తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది.
ఆమె లండన్ లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసేది. ఏడాదికి రూ.2 కోట్లు జీతం తీసుకునేది. పదేళ్ల పాటు ఉద్యోగం చేసినా ఆమెకు అందులో సంతృప్తి లభించలేదు. బ్యాంకింగ్ రంగంలో పనిచేయడం మూలంగా తాను కేవలం కార్పొరేషన్లకు, ప్రభుత్వాలకు మాత్రమే సహాయపడగలుగుతున్నాను. కానీ తన నుండి మరింత ఎక్కువ మందికి తన వల్ల ప్రయోజనం కలగాలని భావించింది. తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది.
2023 జనవరిలో ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది. నిశ్చా షా యూట్యూబర్‌గా అవతారం ఎత్తింది. పర్సనల్ ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్‌గా మారింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి ఆమె రూ.8 కోట్ల రూపాయలు యూట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదించింది. యూట్యూబ్ మానెటైజేషన్ , కోర్సులు, ప్రొడక్ట్స్ అమ్మడం, కార్పొరేట్ చర్చలు నిర్వహించడం, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామి కావడం ద్వారా ఆమెకు ఈ ఆదాయం లభించింది. తాను బ్యాంకింగ్‌లో ఉన్నప్పటి కన్నా యూట్యూబ్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నానని నిశ్చా షా సంతోషం వ్యక్తం చేసింది.
తన యూట్యూబ్ చానల్‌కు 1000 మంది సబ్‌స్ర్కైబర్లు రావడానికి 11 నెలలు పట్టిందని, 2022 సెప్టెంబరులో తన జీవితం గురించి చేసిన ఒక వీడియో వైరల్ అవడంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 50 వేలకు చేరుకుందని, ప్రస్తుతం తన వీడియోలకు 1 లక్ష నుంచి 90 లక్షల వీక్షణలు వస్తున్నాయని వెల్లడించింది.