Begin typing your search above and press return to search.

వైఎస్ సునీత...సీబీఎన్ అపాయింట్మెంట్ 10 లక్షలా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇపుడు బాగానే దొరుకుతుంది. అయితే దానికో దగ్గర దారి ఉంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 6:15 AM GMT
వైఎస్ సునీత...సీబీఎన్ అపాయింట్మెంట్ 10 లక్షలా ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇపుడు బాగానే దొరుకుతుంది. అయితే దానికో దగ్గర దారి ఉంది. అదే వరద సహాయం నిమిత్తం చెక్కులు తీసుకుని వెళ్తే సీఎం ని కలవవచ్చు. ఇది ప్రచారంగా సాగుతోంది. దానిని ఆసరాగా చేసుకుని చాలా మంది సీఎం ని ఇలాగే కలిశారు. కొంతమంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకుంటున్న వారు కూడా బాబు అపాయింట్మెంట్ కోసం గత కొన్నాళ్ళుగా వెయిట్ చేసి చివరికి అనూహ్యంగా వరదలు రావడం విరాళాల కోసం సీఎం పిలుపు ఇవ్వడంతో ఈ రూట్ ని ఎంచుకుని కలిశారు అన్న చర్చ కూడా నడుస్తోంది

అదే విధంగా వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఇదే విధంగా సీఎం ని కలుస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు ఆ కోవలోకి వైఎస్ జగన్ సోదరి వైఎస్ సునీత కూడా వచ్చారు అని అంటున్నారు. ఆమె ఏకంగా పది లక్షల రూపాయల చెక్కుని తీసుకుని వెళ్ళి వరద బాధితులకు అందించారు. ఆ సందర్భంగా ఆమె తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయం గురించి చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు.

నిజానికి చూస్తే వైఎస్ ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ. ఈ రెండు రాజకీయంగా దశాబ్దాలుగా ఎదురు పడుతూనే ఉన్నాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అన్నది ఒక పాత సినిమా డైలాగ్. అచ్చం అలాంటిదే ఈ రెండు కుటుంబాల మధ్యన ఉంది అని అంటున్నారు. ఆ కుటుంబంలో నుంచి ఒకరు వెళ్ళి చంద్రబాబుని కలవడం వరద బాధితులకు పది లక్షల రూపాయల విరాళం ఇవ్వడం మంచిదే అయినా దాని కంటే ఆమె సొంతంగా ఆ నిధులతో వరద బాధితులకు సాయం అందించి ఉంటే బాగుండేది అని అంటున్నారు.

వైఎస్సార్ కుటుంబం అంటేనే ఏపీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ అన్నది అందరికీ తెలిసిందే. ఆమె తన తండ్రి హత్య కేసు విషయం సీఎం కి వివరించే ప్రయత్నం కోసం వెళ్ళి మధ్యలో ఈ వరద బాధితులకు సాయం అని నాటకం ఏంటి అని వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అంతే కాదు వైఎస్సార్ అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా దీని మీదనే డిస్కషన్ చేస్తున్నారు. వైఎస్సార్ అన్నది ఒక బిగ్ సౌండ్ అని ఆ కుటుంబానికి చెందిన మహిళ ఈ విధంగా వ్యవహరించడమేంటని అంటున్నారు. కుటుంబ కలహాలు వ్యక్తిగత విభేదాలు వస్తే ఇలాగే చేస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. పెద్ద వారి పేరు ప్రఖ్యాతులు నిలపాలి కదా అని కూడా అంటున్నారు.

తమ పేరుకు ముందు వైఎస్ అని తగిలించుకుని మరీ ఇలా చేయడమేంటి అని కూడా అంటున్నారు. అంతగా వరద బాధితులను ఆదుకోవాలీ అంటే తామే ఖర్చు పెట్టి వారికి ఇవ్వాల్సినవి ఇచ్చినా వైఎస్సార్ కుటుంబం సాయం చేసింది అన్న పేరు వచ్చేది అని అంటున్నారు. ఆమె అన్న వైసీపీ అధినేతగా ఉన్నారు. ఆయన అంటే గిట్టదు, అదే సమయంలో ఆమె సోదరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

పోనీ ఆ పార్టీకైనా విరాళం ఇచ్చినా సబబుగా ఉండేది అని కూడా అంటున్నారు. మొత్తానికి వైఎస్ సునీత ఇలా చేయడం మాత్రం వైఎస్సార్ అభిమానులకు ఆగ్రహంగానే ఉంది అని అంటున్నారు. వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసు విషయం ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి అనితతో సమావేశమై చర్చించారు. వేగవంతం చేయాలని కూడా కోరారు.

అయితే సీఎం చంద్రబాబుని కలవడం మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. మరి ఆమె అపాయింట్మెంట్ కోరారా అంటే కోరే ఉంటారు అని అంటున్నారు. నాడు లభించని అపాయింట్మెంట్ నేడు లభించింది అంటే దాని వెనక వరద బాధితుల సహాయం చెక్కు ఉందని అంటున్నారు. అంటే సీఎం అపాయింట్మెంట్ పది లక్షల రూపాయాల అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా సునీత తన పోరాటంలో వైఎస్సార్ ఇమేజ్ ని కూడా దెబ్బ తీస్తున్నారు అన్నదే అసలైన అభిమానుల బాధగా ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కుటుంబంలో చీలికలు చాలా దూరం వెళ్ళిపోయినందువల్ల ఇక చేసేది ఏమీ ఉండదని కూడా అంటున్నారు.