జగన్ కి నో పవర్...విజయమ్మ పవర్ ఫుల్ స్టేట్మెంట్ !
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఆయన సొంత తల్లి వైఎస్ విజయమ్మ సంచలనమైన స్టేట్మెంట్ నే ఇచ్చారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఆయన సొంత తల్లి వైఎస్ విజయమ్మ సంచలనమైన స్టేట్మెంట్ నే ఇచ్చారు. జగన్ కి నో పవర్ అని ఒక్క మాటలో తేల్చేశారు. ఇంతకీ ఏ సందర్భంలో ఎందుకు ఆమె ఈ విధంగా అన్నారు అన్నది చూస్తే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ ల్యాండ్స్ కి సంబంధించిన వివాదం ఎన్సీఎల్టీలోలో న్యాయ విచారణకు వచ్చిన సంగతి విధితమే.
తాను సరస్వతి పవర్ ల్యాండ్స్ లో షేర్లను తన చెల్లెలు వైఎస్ షర్మిలకు ప్రేమతో సరస్వతి పవర్ లో రాసిచ్చానని ఇప్పుడు తనకు ఆమెపైన ఎలాంటి ప్రేమ లేదని అందుకే తన కంపెనీ షేర్లు మొత్తం వెనక్కి ఇస్తూ తన పేరిట బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు.
దీని మీద విచారణ జరుగుతోంది. ఇక వైఎస్ విజయమ్మ ఈ కేసులో తన తరఫున దాఖలు చేసిన అఫిడవిట్ లో కుమారుడు జగన్ మీద అలాగే కోడలు భారతి మీద కూడా విమర్శలు చేసినట్లుగా చెబుతున్నారు. అసలు సరస్వతి పవర్ ల్యాండ్స్ అన్న కంపెనీ తనదేనని విజయమ్మ అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం. అంతే కాదు అందులో జగన్ కి కానీ భారతికి కానీ ఎలాంటి వాటాలు కానీ అధికారం కానీ లేనే లేవని ఆమె స్పష్టంగా ప్రకటించారు.
మొత్తం షేర్లు తన పేరిట బదిలీ అయ్యాయని అందువల్ల కంపెనీ తనదని ఆమె వాదిస్తూ ఈ అఫిడవిట్ వేశారు ఏ మాత్రం అధికారం అర్హత లేని జగన్ పిటిషన్ ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. అందువల్ల ఆ పిటిషనే అనర్హమైనది అని ఆమె అంటున్నారు.
ఇక చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని విజయమ్మ జగన్ భారతీల మీద ఆరోపణలు చేశారు. అలాగే ఎన్సీఎల్టీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించడం విశేషం. జగన్ షర్మిలల మధ్య ఆస్తుల తగదా ఉంటే మధ్యలో తనను తెచ్చి కోర్టులో నిలబెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ తల్లికీ ఇటువంటి పరిస్థితి రాకూడదని ఆమె వాపోయారు. తాను ఉన్న ఈ నిస్సహాయ స్థితికి ఆమె తీవ్ర ఆవేదన చెందారు. ఈ రకమైన పరిస్థితిని తీసుకుని రావడం జగన్ కి భారతికి తగదని ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇక సరస్వతి ల్యాండ్ పవర్స్ లో తనకు వచ్చిన వాటాలు అన్నీ చట్టబధమైనవి అని ఆమె స్పష్టం చేశారు. అటువంటిది ఇందులోని వాటాలను షర్మిల భవిష్యత్తు కోసం ఇచ్చాను అని జగన్ చెప్పడం అబద్ధమని ఆమె అఫిడవిట్ లో గట్టిగా చెప్పారు. ఇక సరస్వతి పవర్ కంపెనీలో తనకే మొత్తం 99.75 శాతం వాటాలు ఉన్నాయని జగన్ కి కానీ భారతికి కానీ వాటాలే లేవని ఆమె స్పష్టం చేశారు.
మరో వైపు చూస్తే గతంలో జగన్ ఈ విషయం మీద కేసు వేసినపుడు షర్మిలకు అప్పట్లో ఒక అన్నగా అభిమానంతోనే సరస్వతి పవర్ రాసిచ్చానని అయితే ఆమె తన అభిమానాన్ని కోల్పోయారని ఆయన కేసు వేస్తూ కోర్టుకు నివేదించారు. అందుకే తన కంపెనీ తనకు ఇప్పించాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. అంతే కాదు ఇదంతా తన కుటుంబంలో జరిగిన ఓ ఎంవోయూ ఆధారంగానే తన తల్లి విజయమ్మ పేరుతో ఉన్న వాటాలను బదిలీ చేసినట్లుగా చెప్పారు. కానీ అనధికారికంగా తన తల్లి వాటాలను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు.
మొత్తం మీద చూస్తే ఈ వివాదం ఆసక్తిని కలిగిస్తోంది. తల్లి చెల్లెలు మీద కోర్టుకు జగన్ వెళ్ళారని ఆయనకు రక్త బంధాలు లేవని ఒక వైపు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యం ఉంది. మరో వైపు పీసీసీ ఏపీ చీఫ్ హోదాలో షర్మిల సైతం జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇపుడు ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ లో విజయమ్మ ఏకంగా కుమారుడు జగన్ మీద కోడలు మీద తీవ్ర వ్యాఖ్యలే చేయడం సంచలనం రేపుతోంది. దీని మీద అంతా చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది. చూడాలి మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో.