జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ భారతి క్లాస్ రియాక్షన్!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైపోయింది
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. దీంతో... అన్ని పార్టీలూ ప్రచార కార్యక్రమాపై పూర్తి దృష్టి పెట్టాయి. ఈ సమయంలో నేతలకు తోడు వారి వారి కుటుంబ సభ్యులు ప్రచారాల్లో సహకరిస్తున్నారు. ఈ క్రమంలో... జగన్ కోసం పులివెందులలో భారతి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించారు.
అవును... ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ సమయంలో విమర్శలు ప్రతివిమర్శలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఇందులో భాగంగా... కొంతమంది నేతలు ప్రత్యర్థులపై విజ్ఞతతో కూడిన రాజకీయ విమర్శలు చేస్తుంటే... మరికొంతమంది మాత్రం ఇంగితం మరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వైఎస్ జగన్ పై చంద్రబాబు చేసిన కామెంట్లపై భారతి స్పందించారు.
ప్రస్తుతం.. వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సభలూ, సమావేశాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధం, మేమంతా సిద్ధం యాత్రలో పాటు తాజాగా రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో... పులివెందులలో జగన్ తరుపున వైఎస్ భారతి ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా గడప గడపకూ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా... జగన్ కు గత ఎన్నికల కంటే ఈసారి మరింత ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని పులివెందుల ప్రజలు నిర్ణయించారని భారతి వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలోనూ... చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో జగన్ ను ఉద్దేశించి "జగన్.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది?" అంటూ చంద్రబాబు వ్యఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారతి... ఆ వ్యాఖ్యలు చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా... చంద్రబాబు వయసులో పెద్దవారని.. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించిన భారతి... ఆయన అలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం తప్పు అని అన్నారు. ఇదే క్రమంలో... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని భారతి తెలిపారు. ఒక వ్యక్తిని చంపాలనుకోవటం తప్పని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలను మెప్పించుకోవాలి కానీ... ప్రత్యర్థులను తొలిగించుకోవాలనుకోవటం సరి కాదని హితవు పలికారు.
ఈ క్రమంలోనే మేనిఫెస్టోపై స్పందించిన భారతి... జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని.. అయితే.. చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక, వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఈ క్రమంలొనే ఇప్పుడు కూడా ప్రచారానికి వచ్చానని చెప్పారు.