దసరాకు జగన్ అతి పెద్ద సంచలనం...అదేనా...?

జగన్ విశాఖలో పరిపాలన స్టార్ట్ చేస్తారు అని దానికి గాను ప్రభుత్వ భవనాలు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు.

Update: 2023-08-03 01:30 GMT

ఈసారి దసరా మామూలుగా ఉండదుట. ఏపీ వాసులకు అతి పెద్ద సంచలనంగా మారుతుందిట. ఈసారి విజయదశమి వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ డెసిషన్ ఏంటి అంటే తాడేపల్లిలో ఉన్న తన క్యాంప్ ఆఫీసుని విశాఖ సాగర తీరానికి తెస్తారుట.

విశాఖలో జగన్ సీఎం గా తమ పాలన ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఇదే విషయాన్ని కాస్తా సస్పెన్స్ గా మరి కాస్తా సెన్సేషనల్ గా మంత్రి గుడివాడ అమరనాధ్ చెప్పుకొచ్చారు. విశాఖ సహా ఉత్తరాంధ్రావాసులు అంతా ఒక శుభవార్తను ఈ దసరాకు వింటారు అని గుడివాడ చెప్పారు ఆ శుభవార్త విశాఖ వాసులు చిరకాలంగా ఎదురుచూస్తున్నదే అని కూడా ఆయన అంటున్నారు.

అంటే జగన్ విశాఖకు సీఎం ఆఫీసుని షిఫ్ట్ చేస్తారు అన్న మాట. ఇదే మాటను కొద్ది రోజుల క్రితం విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారు. జగన్ విశాఖలో పరిపాలన స్టార్ట్ చేస్తారు అని దానికి గాను ప్రభుత్వ భవనాలు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు.

విశాఖ బీచ్ రోడులో ఉన్న వుడా భవనాలు చాలా ఉన్నాయని వాటిలోనే సీఎం క్యాంప్ ఆఫీసు పెట్టి మరీ పాలన చేస్తారు అని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ భవనాలను గుర్తించి ఎంపిక చేయడం జరిగిందని కూడా ఆయన వెల్లడించారు.

ఇపుడు అదే మాటను మంత్రి గుడివాడ కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే జగన్ ఈసారి విశాఖ నుంచి పాలన సాగించడమే కాకుండా ఉత్తరాంధ్రాలో వైసీపీకి వచ్చిన అతి పెద్ద మెజారిటీని మ్యాజిక్ నంబర్ ని తిరిగి పొందాలని చూస్తున్నారు అని అంటున్నారు.

జగన్ విశాఖ మకాం మార్చడం వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అవుతుంది అన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. విశాఖకు జగన్ రావడం ద్వారా ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలలో వైసీపీ బలం పెంచుకోవడానికి కూడా చూస్తున్నారు అని అంటున్నారు. విశాఖ టీడీపీకి కంచుకోటగా ఉంది. దాంతో ఈసారి ఆ కోట కొట్టాలంటే జగనే రావాలని రంగంలోకి దిగారు అని అంటున్నారు.

ఇప్పటికే బాబాయ్ ని పంపించడం కూడా అందులో వ్యూహమే అని అంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖ రాకకు ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయింది. అయితే 2020 నుంచి మూడు దసరాల ముహూర్తాలు పెట్టి మరీ వైసీపీ విశాఖ రాజధాని విషయాన్ని వెనక్కి నెట్టింది. మరి ఈ దసరా అయిన వైసీపీ విశాఖ కోరిక 2023 దసరా అయినా తీరుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News