మంచం వీడియో బయటపెడతారా? ఖాకీలకు వార్నింగ్

Update: 2025-02-25 05:19 GMT

తప్పు చేస్తే.. కుమిలిపోవటం.. వేదనకు గురి కావటం..మరోసారి సదరు తప్పు జరగకుండా చూసుకోవటం లాంటివి గతం మాటలు. ఇప్పుడు అందుకు భిన్నంగా రివర్సు గేరులో వార్నింగ్ లు ఇవ్వటం ఒక అలవాటుగా మారింది. తాజాగా విజయవాడలోని ఒక ఖరీదైన స్పాలో జరుగుతున్న వ్యభిచార దందా పోలీసుల సోదాల్లో వెలుగు చూడటం.. అక్కడే మంచం కింద దాక్కున్న వైసీపీ నేత (ఈ ఘటన బయటకు వచ్చాక వైసీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది) సంబంధించిన వీడియో వైరల్ కావటం తెలిసిందే. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. కొద్ది రోజలు క్రితమే తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు.

స్పా సెంటర్ లో మహిళతో దొరికి పోలీసుల్ని బెదిరించినట్లుగా చెబుతున్నారు. మాచవరం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సందర్భంగా తనకు సంబంధించిన వివరాల్ని పూర్తిగా ఇవ్వలేదని చెబుతున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినప్పటికీ.. అతడి వీడియోలు సోషల్ మీడియాలోనూ. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ కావటంతో అతడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఉందని.. తనను వదిలేయాలని ప్రాధేయపడినట్లుగా తెలుస్తోంది.

అయితే.. అతడి వీడియోలు బయటకు రావటంపై పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లుగా చెబుతున్నారు. తన వీడియోలు బయటకు వచ్చేలా చేశారని.. పోలీసులపై మండిపడుతున్న నేత.. అందుకు కారణమైన వారిని వదిలి పెట్టనని.. బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. తాను మంచం కింద దాక్కున్న వీడియో క్లిప్ వైరల్ గా మారిందని.. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని.. ఉన్నత స్థాయి నుంచి కేరాఫ్ ప్లాట్ ఫారానికి పడిపోయానని.. అందంతా పోలీసులే ఉద్దేశపూర్వకంగా చేశారంటూ మండిపడుతున్నారు. ఈ బెదిరింపుల పర్వం ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి.

Tags:    

Similar News