ఐ ప్యాక్ మాట వినమంటున్న వైసీపీ లీడర్స్ ?

ఇక గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అధినాయకత్వానికి చెప్పకుండా క్యాడర్ మనోభావాలను పట్టించుకోకుండా లీడర్లను దరి చేరనీయకుండా ఐ ప్యాక్ ఇచ్చిన వ్యూహాలు ఏమిటి అని కూడా ప్రశ్నిస్తునారు.

Update: 2025-01-06 04:43 GMT

వైసీపీ ఘోర ఓటమి వెనక ఎవరు ఉన్నారు అంటే అనేక కారణాలు ఉన్నాయి వాటికి కేంద్ర బిందువుగా ఐ ప్యాక్ టీమ్ సలహాలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటారు. వైసీపీ అధినాయకత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఘోర పతనానికి బాటలు వేసింది ఐ ప్యాక్ వ్యూహకర్తలు అని అంటారు.

వై నాట్ 175 సీట్స్ అన్న నినాదం ఎంతటి బూమరాంగ్ అయిందో వారు చెబుతూంటారు. అలాగే సిద్ధం సభలు నాలుగైదు చోట్ల పెడితే ఎన్నికలు అయిపోతాయని సలహా ఇవ్వడం కంటే దారుణం ఉండదని అంటారు. వీటికి అన్నింటి కంటే మరీ దారుణమైన సలహా ఏంటి అంటే ఏకంగా వంద మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లుగా ఎడా పెడా మార్చేయడం అని అంటారు.

ఇక గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అధినాయకత్వానికి చెప్పకుండా క్యాడర్ మనోభావాలను పట్టించుకోకుండా లీడర్లను దరి చేరనీయకుండా ఐ ప్యాక్ ఇచ్చిన వ్యూహాలు ఏమిటి అని కూడా ప్రశ్నిస్తునారు. ఇవన్నీ ఎందుకు అంటే మరో మారు ఐ ప్యాక్ టీమ్ ని వైసీపీ అధినాయకత్వం ఎంగేజ్ చేయబోతోంది అన్న వార్తలతో.

వారిని మళ్ళీ తీసుకుంటూ ఎప్పటి మాదిరిగానే వారి సలహా సూచనతో పార్టీ నడపాలని హై కమాండ్ నిర్ణయించింది అన్న వార్తల పట్ల వైసీపీ నేతలు అయితే గుర్రుగా ఉన్నారు. ఐ ప్యాక్ ఇచ్చే సూచనలను మేము పాటించాల్సినది అయితే లేదు అని వారు ఖరాఖండీగా చెబుతున్నారని అంటున్నారు. మాకు వైసీపీ అధినేత జగన్ అల్టిమేట్ లీడర్ అందులో రెండవ మాట లేదు. అయితే మేము ఐ ప్యాక్ సూచనల కంటే క్యాడర్ జనం నుంచి వచ్చే సూచనలు తీసుకుని దానికి అనుగుణంగానే కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు.

ఐ ప్యాక్ ని తిరిగి తీసుకోవడం అన్నది మంచి విధానం కాదని వైసీపీలో చర్చ సాగుతోంది. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసి వ్యూహకర్తలను పెట్టుకుని వారు ఇచ్చే సూచనలతో పార్టీని దిగజార్చుకోవడమే అవుతుందని అంటున్నారు

దానికి బదులుగా వైసీపీలో ఎంతో మంది అనుభవం కలిగిన నేతలు ఉన్నారని, జిల్లాల వారీగా వారితో ముఖా ముఖీ సమావేశాలను నిర్వహించడం ద్వారా వైసీపీ అధినాయకత్వం పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్లవచ్చో ఆలోచనలు చేయవచ్చునని అంటున్నారు.

వైసీపీని జనంలో బలం ఉంది. అలాగే నమ్మకమైన క్యాడర్ ఈ రోజుకీ ఉంది. వారిని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని చూసుకుంటూ ఎప్పటికపుడు అడుగులు ఆ దిశగా వేస్తే పార్టీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని వారు సూచిస్తున్నారు.

ఇక వైసీపీలో అధినాయకత్వం చుట్టూ ఉన్న కోటరీని కూడా పక్కన పెట్టాలని కోరుతున్నారు. కోటరీ వల్లనే పార్టీ పూర్తిగా నష్టపోయింది అని అంటున్నారు. పార్టీ ఉన్నది జనాలలో క్యాడర్ లో గ్రౌండ్ లెవెల్ లో అన్నది కనుక గ్రహించి ఆ దిశగా భవిష్యత్తులఒ చేపట్టే కార్యక్రమాలను డిజైన్ చేస్తేనే మేలు అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఓటమి తరువాత కూడా తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

మరి ఐ ప్యాక్ టీం ని తిరిగి తెస్తే కనుక వైసీపీ హై కమాండ్ కి క్యాడర్ కి లీడర్ కి మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుంది అని కూడా అంటున్నారు. అయితే వైసీపీ మళ్ళీ గెలవాలీ అంటే వ్యూహకర్తల మీద ఆధారపడక తప్పదా అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి వ్యూహకర్తలు కంటే పార్టీ క్యాడరే ఎక్కువ నిజాలు చెబుతారని దానిని అధినాయకత్వం గుర్తిస్తే మంచిదని అంటున్నారు.

Tags:    

Similar News