జగన్ కోటరీ నుంచి బిగ్ షాట్ అవుట్ ?
జగన్ చుట్టూ కోటరీ ఉంటుంది. అది ఆయనను కలవనీయకుండా చేస్తోంది అన్నదే వైసీపీలో నాయకులు కార్యకర్తల ఆవేదన.;

జగన్ చుట్టూ కోటరీ ఉంటుంది. అది ఆయనను కలవనీయకుండా చేస్తోంది అన్నదే వైసీపీలో నాయకులు కార్యకర్తల ఆవేదన. అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కోటరీయే అధికారం పోయిన ఏడాదిలోనూ వెంట ఉంది. దాంతో ఈ కోటీతోనే చిక్కులు అని వైసీపీలో విమర్శలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
అయితే ఈ కోటరీ అన్నది జగన్ కి పార్టీకి మధ్యన ఉందని సాగుతున్న ప్రచారం అధినాయకత్వం దాకా చేరింది అని అంటున్నారు దాంతో పార్టీ పరంగా సీరియస్ స్టెప్స్ ని తీసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నారు అన్నది పుకారుగా షికారు చేస్తున్న వార్త. జగన్ కి నీడగా అయిదేళ్ళ పాటు ఆయన అధికారంలో ఉన్నపుడు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు
ఇపుడు అధికారం పోగానే ఆయనకు కీలకమైన పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ పదవి ఇచ్చారు. అయితే అనుకున్న తీరున పార్టీ వ్యవహరాలు సాగకపోవడంతో భారీ ప్రక్షాళన దిశగా అధినాయకత్వం అడుగులు వేస్తోంది అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ రాష్ట్ర కార్యవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా స్టేట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించిన సజ్జల ప్లేస్ లో పులివెందులలో కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డిని నియమిస్తారు అని అంటునారు. సతీష్ రెడ్డి గత ఏడాది వైసీపీలో చేరారు. ఆయన పాతికేళ్ళుగా వైఎస్సార్ ఫ్యామిలీకి రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్నారు
ఇపుడు మాత్రం జగన్ మీద ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. దాంతో ఆయనకు తొందరలో అత్యంత కీలకమైన ఈ పదవి దక్కబోతోంది అని ప్రచారం సాగుతోంది ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు స్టేట్ కో ఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.
అదే విధంగా సజ్జలకు పార్టీ అనుబంధ సంఘాలను కో ఆర్డినేట్ చేసే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్న్నారు. ఆ విధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రాధాన్యతను గణనీయంగా తగ్గిస్తూ అదే సమయంలో సతీష్ రెడ్డిని పార్టీ కోసం సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు
అదే విధంగా జిల్లా కమిటీలలో కూడా కీలక మార్పులు చేస్తారని అంటున్నారు. పనిచేయని వారిని జిల్లా బాధ్యతల నుంచి తప్పించి పనిమంతులకే పదవులు ఇస్తారని అంటున్నారు. చాలా చోట్ల వైసీపీ జిల్లా అధ్యక్షులు సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు దాంతో అలాంటి చోట వాయిస్ బలంగా వినిపించే వారిని తీసుకుని రావాలని చూస్తారు అని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే వచ్చే వారంలో వైసీపీలో భారీ ప్రక్షాళన దిశగా కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. దాంతో వైసీపీలో సీరియస్ మార్పులకు జగన్ సిద్ధం అవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన పార్టీ క్యాడర్ తో లీడర్ తో నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. రానున్న రోజులలో జిల్లా పర్యటనలకు వెళ్ళబోతున్న క్రమంలో గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తనకు తెలియాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ పార్టీలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారని అంటున్నారు. చూడాలి మారి ఏమి జరుగుతుందో. ఈ వార్తలలో నిజమెంత ఉందో.