జగన్‌పై కేసులు.. కూటమి-వైసీపీల్లోనూ చర్చే ఎందుకు..?
వైసీపీ అధినేత జగన్ పై నమోదైన కేసులు ఎప్పటికి తేలుతాయి? అనే విషయం అటు వైసీపీలోనూ.. ఇటు కూటమిలోనూ చర్చగానే ఉంది.
వైసీపీ అధినేత జగన్ పై నమోదైన కేసులు ఎప్పటికి తేలుతాయి? అనే విషయం అటు వైసీపీలోనూ.. ఇటు కూటమిలోనూ చర్చగానే ఉంది. జగన్‌పై కేసుల విచారణ వడివడిగా ముందుకు సాగాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నాయి. దీనిపై కూటమి పార్టీలకు చెందిన నాయకుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు.. గతంలోనే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటీవల అది విచారణకు కూడా వచ్చింది. చివరకు స్థానిక కోర్టుకే బాధ్యతలు అప్పగిస్తూ.. సుప్రీం నిర్ణయం తీసుకుంది.
కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి రఘురామ.. మరో కోణంలో కేసులు వేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలి సింది. ఇటీవల సుప్రీంకోర్టు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల సభ్యత్వాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రఘురామ ఈ కేసులోనూ ఇంప్లీడ్ అయి.. జగన్ వ్యవహారం తేల్చే పనిలో పడుతు న్నారు. ఇక, వైసీపీ నాయకులు కూడా.. జగన్‌పై కేసులు త్వరగా తేలిపోవాలని కోరుకుంటున్నారు. దీనికి వేరే కారణం ఉంది. ప్రత్యర్థుల నుంచి సూటిపోటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి జగన్ పులుకడిగిన ముత్యంలా బయటకు వచ్చేయాలన్నది వైసీపీలోని కొందరి కోరిక.
వెరసి.. జగన్‌పై కేసుల వ్యవహారం కూటమి-వైసీపీలలో జోరుగానే చర్చ సాగుతోంది. అయితే.. అసలు జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందన్నది ప్రధాన ప్రశ్న. దీనికి కేవలం రాజకీయాలే కారణమా? అంటే.. కాదనే అంటున్నారు న్యాయనిపుణులు. దీనిపై ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనా రాయణ స్పందిస్తూ.. దాదాపు జగన్‌పై నమోదైన అన్ని కేసుల్లోనూ పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారని తెలిపారు. దీంతో వారు తమకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్లపై బలంగా పోరాడుతున్నారన్నది ఆయన వాదన.
దీంతో సుదీర్ఘ కాలం పాటు వాదనలు సాగుతున్నాయని.. దీంతో కోర్టుల్లో సమయం ఎక్కువగా పడుతోంద ని జేడీ చెప్పారు. అంతేకాదు.. సుదీర్ఘకాలం పాటు వాదనలు సాగుతుండడంతో న్యాయ మూర్తుల బదిలీలు కూడా ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక విచారణ సుదీర్ఘంగా రెండేళ్లు, మూడేళ్లపాటు సాగడంతో అంతకాలం ఒకే న్యాయమూర్తి ఆ కోర్టులో విధులు చేసే అవకాశం లేదని.. దీంతో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి ఆ కేసుల విచారణను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోందని.. ఇది కేసుల విచారణకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు.