వైసీపీకి ఉగాది పురస్కారాలిచ్చేశారుగా... !
విశ్వావసునామ ఉగాదిని పురస్కరించుకుని ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి కానుకలు, అవార్డులు ఇవ్వడం తెలిసిందే.;

విశ్వావసునామ ఉగాదిని పురస్కరించుకుని ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి కానుకలు, అవార్డులు ఇవ్వడం తెలిసిందే. అయితే.. రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రం ఎవరూ అవార్డులు ఇవ్వరు. పైగా విమర్శలే వారికి పెద్ద అవార్డులుగా అడకపోయినా కూడా వస్తుంటాయి. ఇలానే.. తాజాగా విశ్వావసు నామ ఉగాదిని పురస్కరించుకుని నెటిజన్లు.. ప్రతిపక్షం వైసీపీకి కొన్ని అవార్డులు ఇవ్వడం గమనార్హం. అంటే.. వారు చేస్తున్న కామెంట్లలో ఆయా వ్యాఖ్యలు చేస్తూ.. కడుపుబ్బనవ్విస్తున్నారు.
నెటిజన్లు పేర్కొంటున్న అవార్డుల్లో ప్రధానంగా.. మాజీ సీఎం జగన్‌ను `బెంగళూరు బద్ధక రత్న` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 22 సార్లు బెంగళూరుకు వెళ్లారు. హైద రాబాద్‌లోని లోటస్‌పాండ్‌ను షర్మిల స్వాధీనం చేసుకున్న దరిమిలా.. జగన్‌కు బెంగళూరే కేరాఫ్‌గా మారింది. దీంతో ఆయన తరచుగా బెంగళూరుకు వెళ్తున్నారు. అంతేకాదు.. పార్టీ కార్యక్రమాలు నాయకుల విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరును బద్ధకంతోపోల్చుతున్నారు నెటిజన్లు.
బూతుల రత్నాలు.. అంటూ.. వైసీపీ నాయకులపై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకులు బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే.. అధికారం కోల్పోయి న తర్వాత కూడా నాయకులు మారలేదని చెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. విద్యుత్ శాఖ అధికారిని దూషించిన తీరు, అదేవిధంగా రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉషలు.. పోలీసు లపై చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. `బూతుల రత్నాలు` పేరుతో వ్యాఖ్యానిస్తున్నారు.
అదేసమయంలో ఇతర ఎమ్మెల్యేల పనితీరును కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి హాజరు కా కుండానే హాజరైనట్టు పుస్తకాల్లో సంతకాలు చేయడం.. అటెండెన్సు వేయించుకుని వెళ్లిపోవడాన్ని కూడా మెజారిటీ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుత ఉగాది సందర్భంగా ఎవరూ ఇవ్వకపోయినా.. వైసీపీ నాయకులు, అధినేత కు కూడా నెటిజన్లే.. తమ కామెంట్లతో ఉగాది పురస్కారాలు ఇవ్వడంగమనార్హం. మరి ఇప్పటికైనా నాయకులు మారతారో లేదో చూడాలి.