బహిరంగ సభలకు వైసీపీ ముహూర్తం ఫిక్స్.. ఈ నెల నుంచే..!
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. అభ్యర్థుల ఖరారు విషయాన్ని వేగంగా తేల్చేస్తోంది. కీలకమైన ఈ విషయాన్ని తేల్చేసిన అనంతరం.. పార్టీ ఇక, బహిరంగ సభలకు రెడీ అవుతోంది.
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. అభ్యర్థుల ఖరారు విషయాన్ని వేగంగా తేల్చేస్తోంది. కీలకమైన ఈ విషయాన్ని తేల్చేసిన అనంతరం.. పార్టీ ఇక, బహిరంగ సభలకు రెడీ అవుతోంది. తాజాగా తాడేపల్లి వర్గాలు చెబుతు న్న సమాచారం ప్రకారం.. ఈ నెల 25 నుంచే పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలు స్తోంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. మరోసారి విజయం దక్కించుకో వడం ద్వారా.. రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పటికి 59 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు, చేర్పులు చేసి ఇంచార్జులను నియమించింది. 10 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఇక, మిగిలిన ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఉంటారని.. ఓ పది నియోజకవర్గాల్లోనే మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధాన క్రతువు పూర్తి చేసుకుని.. ఇక, ప్రచార సమరంలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంది.
తాజా సమాచారం మేరకు.. ఈ నెల 25 నుంచి ప్రాథమికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని.. వైసీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. తొలి సభను విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 3 లక్షల మందిని సమీకరించి.. ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇక, నుంచి ఈ నెలలోనే క్షేత్రస్థాయిలో ప్రచారంతో పాటు.. సభలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
మూడు విధాలుగా వైసీపీ సభలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండలా ల వారీగా విభజించి.. లోకల్ లీడర్స్ ప్రచారం చేయడం ఒక విధానం. రెండోది.. స్టార్ క్యాంపెయినర్స్‌గా కొందరిని నియమించి వారితో ప్రచారం చేయిస్తారు. ఇది జిల్లా స్థాయిలో లేదా.. పార్లమెంటు నియోజక వర్గాల స్థాయిలో జరగనుంది. ఇక, సీఎం జగన్ ఎన్నికలకు నెల రోజుల ముందు జిల్లాల్లో సుడిగాలి పర్యట నలు చేయనున్నారు. దీనికి సంబంధించే .. తాజాగా భీమిలిలో ఏర్పాటు చేసే బహిరంగ సభద్వారా.. ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది.