జగన్ నెత్తిన పాలు పోసిన నవీన్ పట్నాయక్ !

పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్యానక్ విలువలకు నిబద్ధ్తకు పెట్టింది పేరు.

Update: 2024-06-28 03:43 GMT

పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్యానక్ విలువలకు నిబద్ధ్తకు పెట్టింది పేరు. ఆరు పదులకు పైగా వయసు దాటినా రాజకీయ రంగు రుచి వాసనలు ఎరుగని నవీన్ పట్నాయక్ తన తండ్రి ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజూ పట్నాయక్ మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన నేరుగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు.

అంతే కాదు ఒడిశా వంటి వెనకబడిన రాష్ట్రంతో అక్కడ ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పెనవేసుకున్నారు. 24 ఏళ్ల పాటు ఎదురులేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎనభయ్యేళ్ల వయసులో ఆయన మాజీ సీఎం అయ్యారు. ఆయన బీజేపీతో మిత్రుడిగా వ్యవహరించారు. అంతేకాదు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నపుడు కూడా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వారితోనూ సాన్నిహిత్యం నెరిపారు.

అయితే ఈసారి మాత్రం ఆయన రాజకీయ పంధా మారింది. పైగా ఆయన్ను సీఎం సీటు లో నుంచి దించిందే బీజేపీ. దాంతో ఆ పార్టీతో నేరుగా పోరాటం చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది. బిజూ జనతాదళ్ కి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వారంతా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నవీన్ పట్నాయక్ సరైన నిర్ణయం తీసుకున్నారు

తనను ఓడించిన బీజేపీ తనకు ప్రత్యర్ధి అని నవీన్ పట్నాయక్ గట్టిగా నమ్ముతున్నారు. తన రాజకీయ పంధా ఇదే అని ఆయన విడమరచి చెప్పారు. రానున్న రోజులలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పోరాటం చేయనున్నారు.ఆ విధంగా చేయడం ద్వారా ఆయన తానే అసలైన రాజకీయ ఆల్టరేషన్ అని జనాలకు తెలియచేయడం మరోసారి సీఎం అయ్యేందుకు బాటలు వేసుకోవడం చేస్తారని అంటున్నారు.

ఇక నవీన్ ఎలాంటి శషబిషలకు తావులేకుండా బీజేపీతో యుద్ధం ప్రకటించేశారు. అది ఆయాచితంగా ఏపీలో ఉన్న విపక్షం వైసీపీకి వరంగా మారుతోంది. నవీన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఎన్డీయేకు ఏ మాత్రం మెజారిటీ లేని చోట పదేళ్ళుగా నవీన్ పట్నాయక్ ఇచ్చిన మద్దతుతో అనేక బిల్లులను సునాయాసంగా మోడీ సర్కార్ ఆమోదించుకుని వచ్చింది.

ఇపుడు నవీన్ నో చెప్పేశారు. దాంతో బీజేపీకి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న వైసీపీ అవసరం మరింత ఎక్కువ కానుంది. 2026 వరకూ రాజ్యసభలో ఎన్డీయే బలం ఏ కొంచెం కూడా పెరిగే సూచనలు లేవు. అలాగే ఏపీ నుంచి టీడీపీ ప్రాతినిధ్యం కూడా అపుడే మళ్లీ మొదలవుతుంది. అంటే గట్టిగా రెండేళ్ల దాకా వైసీపీదే రాజ్యసభలో ఏపీ నుంచి ఆధిపత్యం.

ఇపుడు నవీన్ తలాఖ్ చెప్పేశాక వైసీపీయే బీజేపీకి దిక్కు కాబోతోంది. నిజానికి నవీన్ బాటలోనే వైసీపీ కూడా నడవాలి. తనను ఓడించిన బీజేపీకి దూరంగా నవీన్ జరిగారు. అలాగే ఏపీలో తనను మాజీ సీఎం గా చేసిన బీజేపీకి జగన్ దూరం పాటించాలి. కానీ తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చారు.

ఈ నేపధ్యంలో రాజ్యసభలో బీజేపీకి వైసీపీ కచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బీజేపీ కూడా వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండేందుకు ఈ పరస్పర అవగాహన దోహదపడుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News