60 కోట్ల భరణం డిమాండ్‌పై ధనశ్రీ ఫ్యామిలీ క్లారిటీ
''భరణం విషయంలో ఇదంతా తప్పుడు ప్రచారం'' అంటూ అతడు సీరియస్ అయ్యాడు. అంత పెద్ద మొత్తాన్ని మేం ఎప్పుడూ అడగలేదు.. డిమాండ్ చేయలేదు.
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. విడాకులు ఖరారు కాగానే, చాహల్ తన మాజీ భార్యకు ఎంత భరణం చెల్లించాడు? అంటూ ఒకటే చర్చ వేడెక్కించింది. చాహల్ నుండి ధనశ్రీ రూ.60 కోట్ల భరణం డిమాండ్ చేసిందనే ఊహాగానాలు కొంతకాలంగా ఉన్నాయి. ఇప్పుడు కోర్టులో విడాకులు ధృవీకరించాక మరోసారి భరణంపై పుకార్లు తీవ్రతరం అయ్యాయి. దీంతో ధనశ్రీ వర్మ కుటుంబ సభ్యుడు ఈ పరిణామంపై స్పందిస్తూ అంత పెద్ద మొత్తం అడగలేదని అన్నారు.
''భరణం విషయంలో ఇదంతా తప్పుడు ప్రచారం'' అంటూ అతడు సీరియస్ అయ్యాడు. అంత పెద్ద మొత్తాన్ని మేం ఎప్పుడూ అడగలేదు.. డిమాండ్ చేయలేదు. ఎదుటివారు మాకు ఇవ్వనూలేదు!'' అని ధనశ్రీ వర్మ బంధువు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ధనశ్రీ కుటుంబ జీవనాధారం చుట్టూ ఉన్న పుకార్లలోను ఏదీ నిజం కాదని ఆ కుటుంబం పేర్కొంది. మీడియా ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించడం చాలా బాధ్యతారాహిత్యం..ఇరు పార్టీలను మాత్రమే కాకుండా వారి కుటుంబాలను కూడా అనవసరమైన ఊహాగానాలలోకి లాగడం సరికాదు. ఈ విధంగా నిర్లక్ష్యంగా కథనాలు వేయడం హాని కలిగిస్తుంది. తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు మీడియా సంయమనం పాటించాలని, వాస్తవాలను తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరి గోప్యత విషయంలో గౌరవంగా ఉండాలని మేము కోరుతున్నాము! అని ధనశ్రీ కుటుంబం ప్రకటించింది.
చాహల్ -ధనశ్రీ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఈ జంట గత 18 నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారని, వారు విడిపోవడానికి ప్రధాన కారణం 'సానుకూలత సమస్యలు' అని న్యాయమూర్తికి వెల్లడించారని కథనాలొచ్చాయి. గురువారం సాయంత్రానికి ఈ జంటకు బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసిందని మీడియా కథనాల్లో వెల్లడించింది.