ఇక ఢిల్లీ బాబాయ్ ఆయనేనా ?

వైసీపీలో చాలా కీలకమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఓటమి ఎంతటి చేదు అనుభవాలను ఇస్తుందో వైసీపీని చూస్తే అర్థం చేసుకోవాలని అంటున్నారు.

Update: 2025-02-01 04:13 GMT

వైసీపీలో చాలా కీలకమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఓటమి ఎంతటి చేదు అనుభవాలను ఇస్తుందో వైసీపీని చూస్తే అర్థం చేసుకోవాలని అంటున్నారు. గత ఏడాది ఇదే సమయానికి వైసీపీ అధికార వైభోగంతో నిండుగా రాజసంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు.

ఇపుడు చూస్తే వైసీపీలో ఎవరుంటారో ఎవరు ఉండరో అన్నదే చర్చగా ఉంది. వైసీపీలో విజయసాయిరెడ్డి అన్న వారు లేకుండా పోతారని ఆయన పార్టీని వీడిపోతారని ఎవరైనా కలలో కూడా అనుకున్నారా అన్నది కూడా ఆలోచిస్తునారు. అంతటి పెద్దాయనే పార్టీకి వీడుకోలు పలికితే ఇక ఎవరు ఏమిటి అన్నది కూడా అర్థం కావడం లేదు అంటున్నారు.

ఇక ఢిల్లీ రాజకీయాల్లో చూస్తే వైసీపీ తరఫున పెద్ద దిక్కుగా ఉండే విజయసాయిరెడ్డి తప్పుకున్నాక జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పరపతి ఒక్కసారిగా పెరిగిపోయింది అని అంటున్నారు. ఆయన గత ఏడాది మార్చిలో రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. ఆయనను జగన్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు.

అప్పటిదాకా ఆ పదవిలో ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ఈ పదవిని వైవీకి ఇవ్వడంతోనే విజయసాయికి పార్టీ అధినాయకత్వానికి కొంత గ్యాప్ ఏర్పడింది అని అంతా అనుకున్నారు. అయితే అది కాస్తా చివరికి ఆయనే పార్టీని వీడిపోయేలా చేసింది అని అనుకున్న వారూ ఉన్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎంపిక చేయడం వెనక ఇలాంటి పరిణామాలు వస్తాయని ముందే ఊహించారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే వైసీపీకి ఇపుడు పెద్ద దిక్కుగా ఢిల్లీలో పార్టీ పరంగా అవసరాలు తీర్చే నేతగా వైవీ సుబ్బారెడ్డి కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఇక మీదట ఆయన మీదనే పార్టీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఆధారపడుతుందని అంటున్నారు. పైగా జగన్ కి సొంత బాబాయ్ కావడంతో ఆయనకు అధినాయకత్వంతో డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటుందని భావిస్తున్న వారు అంతా ఇపుడు వైవీ చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు.

ఇటు పార్టీ నాయకులకు అటు జగన్ కి మధ్య అనుసంధానంగా వైవీ సుబ్బారెడ్డి కీలక పాత్ర లోకి మారిపోతున్నారని అంటున్నారు ఆయన ప్రాధాన్యత కూడా బాగా పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో ఒకనాడు కీలకంగా ఉన్న వారు జగన్ వద్ద సన్నిహితంగా ఉన్న వారు ఇపుడు లేరు అని అంటున్నారు.

వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళారు. అలాగే విజయసాయిరెడ్డి రాజకీయాలకే స్వస్తి పలికారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మునుపటి ఆదరణ అయితే పార్టీలో లేదని అంటున్నారు. దీంతో వైసీపీలో ఇపుడు వైవీ సుబ్బారెడ్డి హవా బలంగా ఉందని అంటున్నారు. బహుశా ఆయన నంబర్ టూగా వ్యవహరించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు

మరి వైవీ సుబ్బారెడ్డి ఏ విధంగా నెగ్గుకుని వస్తారు అన్నది చూడాలని అంటున్నారు. రఘురామ క్రిష్ణంరాజు చెప్పినట్లుగా నంబర్ టూ అన్నది చాలా రిస్కీ జాబ్ గా వైసీపీలో మారుతోందని అంటున్నారు. సో చూడాలి మరి ఢిల్లీ బాబాయ్ ఏ విధంగా తనదైన రాజకీయం చేసి చూపిస్తారో అని వైసీపీలో అంటున్న మాట.

Tags:    

Similar News