సహజీవనం.. హత్య.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వరకట్నం కోసం హత్యకు గురైన మహిళ కేసు నుంచి తనను విముక్తుడ్ని చేయాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషుడి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
కీలక వ్యాఖ్య చేసింది అలహాబాద్ హైకోర్టు. బాధిత మహిళ.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషుడు భార్యభర్తలు కానప్పటికి సహజీనవం చేస్తున్నప్పటికి.. కట్నం కోసం హత్య జరిగిందన్న నేరారోపణపై విచారణ చేపట్టొచ్చన్న వాదనకు ఓకే చెప్పింది. వరకట్నం కోసం హత్యకు గురైన మహిళ కేసు నుంచి తనను విముక్తుడ్ని చేయాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషుడి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సహజీవనం చేస్తున్నంత మాత్రాన వరకట్నం కోసం వేధింపులకు గురి చేయలేదని చెప్పలేమని పేర్కొంది.
అసలేం జరిగిందంటే.. ఒక వ్యక్తితో బాధితురాలి పెళ్లి చేసుకుంది. తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నిందితుడితో సహజీవనం చేస్తుందన్నది నిందితుడి వాదన అయితే.. బాధితురాలి తరఫు వాదనల్ని చూస్తే.. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుందని.. వరకట్న వేధింపులకు హత్యకు గురైనట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాము పెళ్లి చేసుకోలేదని.. సహజీవనం మాత్రమే చేస్తున్నామని.. అందుకే విడాకులు.. వేధింపుల ఆరోపణల నుంచి తనను తప్పించాలని నిందితుడు తరఫు లాయర్ వాదనలు వినిపించారు.
అయితే.. హత్యకు గురైన బాధితురాలు నిందితుడి ఇంట్లోనే హత్యకు గురైందని.. నేరం జరిగిన సమయంలో మరణించిన మహిళ.. నిందితుడు పెళ్లికానప్పటికీ కలిసి ఉంటే విచారించి శిక్షించొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడ్ని పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నప్పుడు.. ఇరువురికి చట్ట ప్రకారం పెళ్లి కాలేదు కాబట్టి.. నిందితుడిపై వరకట్నం కేసును నమోదు చేయకూడదని నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. ఈ వాదనను ప్రభుత్వ తరఫు న్యాయవాది తప్పు పట్టారు.
విడాకులు తీసుకున్న తర్వాత బాధితురాలు నిందితుడ్ని పెళ్లాడిందని.. అతడి చేతిలో వరకట్న వేధింపులకు.. హత్యకు గురైందని పేర్కొన్నారు. ఈ విషయంలో పెళ్లి కానంత మాత్రాన వరకట్న వేధింపులు జరగలేదన్న అంశాన్ని పరిణగలోకి తీసుకోమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా పెళ్లి చేసుకోకున్నా.. సహజీవనం చేస్తున్నా వేధింపులకు గురైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటే.. ఆ అంశంపై కేసు నమోదు చేసి విచారించొచ్చన్న విషయాన్ని తాజా కేసుతో అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పాలి.