'స్త్రీ భయపడి ఒప్పుకున్నా అది అత్యా*చారమే'... కోర్టు కీలక వ్యాఖ్యలు!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యా*చారానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.

Update: 2024-09-16 10:33 GMT

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యా*చారానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కాగా.. దానికి సంబంధించి తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ ఆ వ్యక్తి పిటిషన్ వేశాడు. తాజాగా దీనిపై జస్టిస్ అనిస్ కుమార్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది!

అవును... భయంతో లేదా భ్రమల్లో ఉన్న యువతి అంగీకారంతో శృం*గారంలో పాల్గొన్నప్పటికీ.. దానికి అత్యా*చారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా... పిటిషనర్ దారు తరుపు న్యాయవాది వాదిస్తూ... కేసు పెట్టిన యువతికి, యువకుడికి చాలా కాలంగా పరిచయం ఉందని తెలిపారు.

ఈ క్రమంలో ఇద్దరూ సివిల్స్ కి సన్నద్ధమయ్యే వారని.. ఆ సమయంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే దగ్గరయ్యారని కోర్టును నివేదించారు. అదేవిధంగా ఈ బంధం చాలా కాలంపాటు కొనసాగిందని న్యాయస్థానానికి తెలిపారు. ఇది పూర్తిగా ఇద్దరి అంగీకారంతో జరిగిన వ్యవహారమని తెలిపారు.

అయితే ఈ వాదనను ప్రభుత్వం తరుపు న్యాయవాది ఖండించారు. ఇందులో భాగంగా... ఈ ఇద్దరి మధ్య బంధం యువతి మోసపోవడంతోనే ప్రారంభమైందని కోర్టుకి తెలిపారు. ఈ సమయంలో ఆధారాలను పరిశీలించిన కోర్టు... ఈ ఇద్దరి మధ్య బంధం పిటిషన్ దారు బాధితురాలిని మోసం చేయడంతోనే ప్రారంభమైందని.. దానికి ఆమె అంగీకారం లేదని తెలిపింది.

ఇదే సమయంలో.. ఆ తర్వాత వీరిద్దరూ అంగీకారంతోనే దగ్గరై ఉండొచ్చు కానీ... ఆ బాధితురాలి ఒప్పుకోలు అనేది భయం, భ్రమల్లో నుంచి వచ్చినదే అని తెలిపింది. ఈ సమయంలోనే... భయంతోనో, భ్రమల్లోనో ఉన్న స్త్రీ అంగీకారంతో శృం*గారంలో పాల్గొన్నా అది అత్యా*చారమే అని తెలిపింది. దీనిపై విచారణ నిలిపేయడానికి ఏ కారణమూ కనిపించడం లేదంటూ పిటిషన్ ను తోసిపుచ్చింది!

Tags:    

Similar News