కోడి కత్తి కేసులో కీలక పరిణామం... ఎన్.ఐ.ఏకు సుప్రీం షాక్..!

ఇందులో భాగంగా... ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తూ కీలక తీర్పు వెలువరించింది

Update: 2024-07-15 11:03 GMT

ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తూ కీలక తీర్పు వెలువరించింది.

అవును... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఇదే కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది.

కాగా... వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు గతంలో ఐదేళ్ల తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో ఎన్.ఐ.ఏ. అభ్యంతరం వ్యక్తం చేసిన తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్.ఐ.ఏ. సుప్రీంని ఆశ్రయించింది. దీంతో నేడు ఈ కేసును విచారించిన సుప్రీం... ఈ వ్యవహరంలో జోక్యం చేసుకునేందుకు నిరకరిస్తూ తీర్పు వెలువరించింది.

కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు ఎన్.ఐ.ఏ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో... జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఎన్.ఐ.ఏకు ఎదురుదెబ్బ తప్పలేదు. మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్రా లేదని ఏపీ హైకోర్టులో ఎన్.ఐ.ఏ. గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

అయితే... దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడి బెయిల్ ను ఎన్.ఐ.ఏ. వ్యతిరేకిస్తోంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో విచారణలో ఉంది.

Tags:    

Similar News