భార్య ఫోన్ కాల్ డేటా సేకరించిన భర్త.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
అవును... రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన ఓ మహిళ మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రతీ వ్యక్తికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది.. ప్రతీ ఒక్కరిలోనూ కొన్ని రహస్యాలు ఉంటాయి.. భార్యాభర్తలు అయినంత మాత్రాన్న అవి ఒకరికొకరు షేర్ చేసుకోవాలనే రూల్ ఏమీ లేదు.. అది వారి వారి మధ్య ఉన్న అండర్ స్టాడింగ్ ని బట్టి ఉంటుంది అని చెబుతుంటారు. ఈ సమయంలో హైకోర్టులో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును... రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన ఓ మహిళ మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో.. తనకు 2003లో వివాహం అయ్యిందని.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొంది. ఈ సమయంలో.. తన భర్త విడాకులు కోరుతూ పరమక్కుడి కోర్టులో కేసు వేశాడని.. తన సెల్ ఫోన్ కాల్ దేటా మొత్తం సేకరించాడని తెలిపింది.
తాను సెల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడింది డేటా సేకరించి, వాటికి సంబంధించిన పత్రాలు కోర్టులో దాఖలు చేశాడని, వాటిని ఆమొదించకూడదని తాను దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసిందని, అందువల్ల ఆ ఉత్తర్వ్యులను రద్దు చేయాలని ఆమె కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ స్వామినాథన్... కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. సెల్ ఫోన్ కాల్ డేటా పొందేందుకు సంబంధిత కంపెనీకి ఆన్ లైన్ లో అప్లై చేసినప్పుడు.. ఓటీపీ వస్తుందని.. దానికి ఉపయోగించి పత్రలు డౌన్ లోడ్ చేయాలని.. కానీ.. ఈ కేసులో భార్యకు తెలియకుండా భర్త పత్రాలను డౌన్ లోడ్ చేశాడని.. దీనిని ఆమోదించరని తెలిపారు.
ఇదే సమయంలో... వివాహం అనేది భార్యాభర్తల నమ్మకంతో ముడిపడిందని.. ఒకరి వ్యక్తిగత హక్కులు మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. ఇదే సమయంలో తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఎలక్ట్రానిక్ సంబంధిత పత్రాలు పరిశీలించి ధృవపత్రం ఇవ్వడానికి మూడు నెలల్లో నిపుణులను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారు!
ఈ విధంగా... భార్య సెల్ ఫోన్ కాల్ డేటా భర్త సేకరించిన వ్యవహారంపై వ్యక్తిగత హక్కులను హరించి, డాక్యుమెంట్స్ దాఖలూ చేస్తే వాటిని విచారణను కోర్టు ఆమోదించకూడదని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తన డైరీని భర్త చదవకూడదని భార్య అనుకోవడం సరైనదేనని.. ఇది సెల్ ఫోన్ కి కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.