బిగ్ బ్రేకింగ్.. హైకోర్టులో మిథున్ రెడ్డికి షాక్

ఏపీలో మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.;

Update: 2025-04-03 10:00 GMT
బిగ్ బ్రేకింగ్.. హైకోర్టులో మిథున్ రెడ్డికి షాక్

ఏపీలో మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకలు జరిగాయని, ఇందులో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టివేసింది. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎంపీని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉన్న మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పు తీవ్ర నిరాశను మిగిల్చింది. గత ప్రభుత్వంలో మిథున్ రెడ్డితోపాటు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యహరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు మిథున్ రెడ్డి. జగన్ తరఫున అన్నిరకాల రాజకీయ వ్యూహాలను ఈ ఇద్దరు తండ్రికొడుకులు అమలు చేస్తుండేవారు. దీంతో ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్రపై సీఐడీ కేసు నమోదు చేసింది.

వాస్తవానికి మిథున్ రెడ్డి అరెస్టుకు హైకోర్టు ఎప్పుడో లైన్ క్లియర్ చేసిందని అంటున్నారు. కాకపోతే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున సీఐడీ వేచిచూసిందని చెబుతున్నారు. మార్చి 20వ తేదీనే మిథున్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనారోగ్యం కారణంగా హైకోర్టు పునర్విచారణలో 3వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సూచించింది. ఇక తాజాగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమం అయనట్లేనంటున్నారు. అయితే హైకోర్టు తీర్పుపై ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఏదిఏమైనా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసినట్లే జరుగుతుండటంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News