"కవితతో సమానంగా మాగుంట పాత్ర ఉంది!"... సుప్రీం తీవ్ర ఆగ్రహం!

ఇందులో భాగంగా.. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదంటూ ప్రశ్నించింది.

Update: 2024-08-28 04:43 GMT

దేశంతో తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వైఖరిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా.. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదంటూ ప్రశ్నించింది.

అవును... ఢిల్లీ లిక్కర్ కేసులో టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కవితతో దాదాపుగా సమానపాత్ర ఉన్న శ్రీనివాసులు రెడ్డిని నిందితునిగా ఎందుకు చేర్చలేదని ఈడీ, సీబీఐ తరుపు వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ని సూటిగా ప్రశ్నించింది.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందులో భాగంగా... "చేర్చడం.. చేర్చకపోవడం అంతా మీ ఇష్టమేనా..? ప్రాసిక్యూషన్ కు నిబద్ధత అనేది అవసరం లేదా? ఈ కేసులో మాగుంట సాక్షి మాత్రమేనా? నిందితుడు కాదా? అంటూ న్యాయమూర్తి బీఆర్ గవాయి... ఏఎస్జీ ఎస్వీ రాజుని నిలదీసారు.

ఇదే క్రమంలో... “మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కలిశారు.. కవితతోనూ కో ఆర్డినేషన్ చేసుకోవాలని కేజ్రీవాల్ ఆయనకు సూచించారు.. ఈ నేపథ్యంలో నిర్ణయాలన్నీ మాగుంట ఇంట్లోనే ఖరారైనట్లుగా కనిపిస్తోంది.. అయినా ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు.. ఆయన కుమారుడిని నిందితుడిగా చేర్చి.. తర్వాత అప్రూవర్ గా అంగీకారించారు.. అదేంటి?” అని సుప్రీం ప్రశ్నించింది.

ఇదే క్రమంలో... ఇలాంటి విషయాల్లో ప్రాసిక్యూషన్ నిజాయతీగా వ్యవహరించాలి.. ఇష్టం వచ్చినట్లుగా నిందితులను చేర్చి అయినవారిని వదిలిపెడతారా అంటూ జస్టీస్ బీఆర్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే స్పందించిన కవిత తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గీ... నిందితులెవరూ అప్రూవర్లుగా మారకముందు ఇచ్చిన వాంగ్ములంలో ఆమె పేరు చెప్పలేదని.. మాగుంట రాఘవ్ అప్రూవర్ గా మారిన వారం రోజుల్లోనే బెయిల్ వచ్చిందని గుర్తుచేశారు.

Tags:    

Similar News