' సీబీఐ విచారణకు రాష్ట్రాల సమ్మతి' పై సుప్రీం సంచలన తీర్పు

సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది.

Update: 2025-01-04 03:56 GMT

అవినీతి కేసులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా... న్యాయమూర్తులు జస్టిస్ రవికుమార్, జస్టిస్ రాజేష్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం సీబీఐ విచారణకు రాష్ట్రాల సమ్మతిపై కీలక వ్యాఖ్యలు చేసింది!

అవును... సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. దీంతో.. దేశంలోని 10 రాష్ట్రాలకు సుప్రీం షాక్ ఇచ్చినట్లేననే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మేఘాలయ లు ఉన్నాయి.

అవినీతి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేసింది. ఈ సమయంలో.. ఆ దర్యాప్తును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.

కాగా... రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఇది ప్రధానంగా తెలంగాణ సహా తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్ అని అంటున్నారు!

ఏపీలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేయడంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్రాల పరిధిలో పని చేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి సీబీఐకి అవసరం లేదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News