స్వలింగ వివాహాలపై కుండబద్దలు కొట్టిన సుప్రీంకోర్టు!

అవును... దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సర్వోన్నత న్యాయ్స్థానం తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు తేల్చేసింది.

Update: 2025-01-10 05:31 GMT

దేశంలో స్వలింగ వివాహాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి లివింగ్ రిలేషన్స్ పైనే పలువురు పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదని.. వీళ్లకు పిల్లలు, వారి బాధ్యతలు ఉండవని, దీనివల్ల మానవ మనుగడ ముందు ముందు ప్రశ్నార్ధకంగా మరుతుందని చెబుతున్నారు!

ఇక స్వలింగ వివాహాల విషయంలోనూ తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇది చట్ట విరుద్ధం మాత్రమే కాదు సృష్టి విరుద్ధం అని పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఒకసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్వలింగ వివాహాలపై తన వైఖరిని కుండబద్దలు కొట్టింది.

అవును... దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సర్వోన్నత న్యాయ్స్థానం తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు తేల్చేసింది. ఈ తరహా వివాహాలకు చట్టపరంగా ఎటువంటి గుర్తింపునూ ఇవ్వలేమని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది.

వివరాళ్లోకి వెళ్తే... స్వలింగ వివాహాలపై 2023 అక్టోబర్ లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇంద్లో భాగంగా... ఈ తరహా వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది.

అయితే... ఈ తీర్పుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. పలువురు సామాజిక కార్యకర్తలతో పాటు గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, ఇంటర్ సెక్స్ తదితర వర్గాలూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమయంలో నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహం, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా... 2023నాటి తీర్పులో ఎలాంటి పొరపాటూ లేదని తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Tags:    

Similar News