మీరు ఏ జనరేషన్ కి చెందినవారో ఎలా తెలుసుకోవాలంటే..?

ఓ వ్యక్తి గుర్తింపు, ప్రవర్తన, జీవితంపై దృక్పథం గురించి అంతర్దృష్టులను ‘తరం’ అనేది తెలుపుతుందని అంటారు.

Update: 2024-11-20 22:30 GMT
మీరు ఏ జనరేషన్  కి చెందినవారో ఎలా తెలుసుకోవాలంటే..?
  • whatsapp icon

ఓ వ్యక్తి గుర్తింపు, ప్రవర్తన, జీవితంపై దృక్పథం గురించి అంతర్దృష్టులను ‘తరం’ అనేది తెలుపుతుందని అంటారు. ప్రతీ తరం వారి వారి దృక్కోణాలు, కమ్యునికేషన్ శైలులను రూపొందించే ప్రత్యేక అనుభవాలను, సాంకేతిక పురోగతిని కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా ఎవరు ఏ తరానికి చెందినవారు అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దామ్!

అవును... పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని తరాలకు కాల పరిధులను నిర్ణయించారు. ప్రస్తుతం ఆల్ఫా గా చెబుతోన్న ఆరో జనరేషన్ నడుస్తుండగా.. మిగిలిన ఐదు జనరేషన్లూ.. సాంప్రదాయవాదులు, బేబీ బూమర్స్, జెనరేషన్ ఎక్స్, మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ గా విభజించబడ్డారు. వీరిలో 1925 నుంచి 1945 మధ్య జన్మించిన వారిని సంప్రదాయవాదులుగా అభివర్ణించారు!

బూమర్స్ జనరేషన్:

1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారిని బూమర్ జనరేషన్ కి చెందినవారు అని అంటారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో పెరగగా.. బలమైన నీతిని, వృత్తి నైపుణ్యాలను, సంప్రదాయ విలువలకు వీరు ప్రసిద్ధి చెందినవారిగా అభివర్ణించబడ్డారు.

జనరేషన్ ఎక్స్:

1965 నుంచి 1980 మధ్య జన్మించిన వారు జనరేషన్ ఎక్స్. వీరు.. స్వాతంత్ర్యం, ‘వర్క్ - లైఫ్’ బేలెన్సింగ్ పై బలమైన ప్రాధాన్యతను కలిగి ఉంటారు. తమ బూమర్ తల్లితండ్రుల అంకితభావాన్ని, వారి వృత్తిపట్ల విధేయతను చూస్తూ వీరు పెరిగినవారు. వీరు స్వంత వృత్తిపరమైన విలువలను రూపొందించారు!

మిలీనియల్ జనరేషన్:

1981 నుంచి 1996 మధ్య జన్మించినవారిని మిలీనియల్స్ అంటారు. వీరు సామాజిక న్యాయం, వ్యక్తిగత నెరవేర్పుకు విలువనిచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారని అంటారు.

జనరేషన్ జెడ్:

1997 తర్వాత జన్మించిన వారిని జనరేషన్ జెడ్ (జెన్ - జెడ్) గా పేర్కొంటారు. వీరు వారి వారి సృజనాత్మకత, అనుకూలతలతో పాటు ప్రపంచ సమస్యల పట్ల ఆందోళనకు ప్రసిద్ధి చెందినవారిగా అభివర్ణించబడతారు!

ఈ క్రమంలో... మిలీనియల్స్, జెన్ జెడ్ కు చెందినవారు సాంకేతికత, సౌకర్యవంతమైన పని వాతావరణాలను స్వీకరించే అవకాశం ఉండగా.. బూమర్ లు, జెన్ ఎక్స్ లకు చెందిన్నవారు తరచూ నిర్మాణాత్మక, సాంప్రదాయ విధానాలను ఇష్టపడతారని అంటారు!

Tags:    

Similar News