రిపోర్టు: లగ్జరీ ఇళ్ల ధరలు ఎంతలా పెరుగుతున్నాయంటే?

విలాసవంతమైన ఇళ్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలతో ఒక నివేదికను సిద్ధం చేసింది నైట్ ఫ్రాంక్ సంస్థ.

Update: 2025-02-11 05:00 GMT

విలాసవంతమైన ఇళ్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలతో ఒక నివేదికను సిద్ధం చేసింది నైట్ ఫ్రాంక్ సంస్థ. ఈ రిపోర్టును చదివితే లగ్జరీ ఇళ్లకు ఇంత డిమాండా? వాటి ధరలు పెరుగుతున్న వైనం చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్ కు తగ్గట్లే.. మన దేశంలోని ప్రధాన నగరాల్లోని లగ్జరీ ఇళ్లు ఇదే విధంగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ4, 2024 పేరుతో విడుదలైన రిపోర్టును చూస్తే.. ప్రపంచంలో అత్యంత వేగంగా లగ్జరీ ఇళ్ల ధరల పెంపులో సియోల్ మొదటి స్థానంలో ఉంది, 18.4 శాతంతో దూసుకెళుతోంది. ఆ తర్వాతి స్థానంలో మనీలా 17.9 శాతం.. దుబాయ్ 16.9 శాతం.. టోక్యో 12.7 శాతం.. నైరోబీ 8.3 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మన దేశానికి వస్తే ఢిల్లీతో పాటు ముఖ్యనగరాల్లో విలాసవంతమైన ఇళ్ల ధరల పెంపులో స్పీడ్ కనిపిస్తోంది. గత ఏడాది 16వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈసారి ఆరో స్థానానికి చేరింది. ముంబయి ఏడో స్థానానికి దూసుకెళ్లటం గమనార్హం. బెంగళూరు 27వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరుకుంది. జాబితాలో పేర్కొన్న 44 నగరాల్లో 34 నగరాల్లో ధరలు పెరిగిన వైనం ఈ రిపోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగటం ఖాయమంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు స్థిరమైన ఆర్థిక వ్యవస్థ.. సానుకూల మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో లగ్జరీ ఇళ్ల ధరలు మరింత దూసుకెళతాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News