లగ్జరీ కార్లు తెగ కొనేస్తున్న భారతీయులు... రిపోర్ట్స్ వైరల్!

ఆ సంగతులు అలా ఉంటే... ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారతదేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

Update: 2023-08-03 00:30 GMT

భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని కొంతమంది అంటుంటే... రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే ఆర్థికశక్తి అవుతుందని ఇంకొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు. ఇదే సమయంలో ఆర్థికపరమైన అసమానతలు కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి.. భిన్నత్వంలో ఏకత్వానికి కొత్త అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి.

ఆ సంగతులు అలా ఉంటే... ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారతదేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీంతో భారతదేశంలో లగ్జరీ కార్ల సంస్కృతి పెరుగుతుందనడానికి ఇవే తాజా ఉదాహరణలని అంటున్నారు. ఈ సందర్భంగా భారతీయులు చాలా ప్రోత్సాహకరమైన రేటుతో హై ఎండ్ కార్లను కొనుగోలు చేసే ట్రెండ్‌ పై సంక్షిప్త నివేదిక తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... లగ్జరీ కార్ల తయారీదారులు.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి లు 2023 మొదటి అర్ధభాగం (జనవరి - జూన్‌)లో రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించాయి. ఇందులో భాగంగా.. బెంజ్ 2023 ప్రథమార్ధంలో మొత్తం 8,528 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయ యూనిట్ల కంటే 13% పెరుగుదల అని అంటున్నారు.

ఇదే సమయంంలో బీఎండబ్ల్యూ మొదటి అర్ధభాగంలో 5,867 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన యూనిట్ల సంఖ్యతో పోలిస్తే 5% పెరిగింది. ఈ మొత్తం లెక్కింపులో 391 మినీ కార్ల విక్రయాలు కూడా ఉన్నాయి.

ఇక ఆడి విషయానికొస్తే... ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 3,473 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం నమోదు చేసిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే 9.7% పెరుగుదల. దీంతో భారతదేశంలో లగ్జరీ కార్ల ట్రెండ్‌ లో పెరుగుదలకు ఇది తాజాగా ఉదాహరణ అని అంటున్నారు.

మొత్తం మీదా ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో సుమారు ఇరవైవేలకు పైగా లగ్జరీ కార్లు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో... ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్య 46,000 - 47,000కి చేరవచ్చు. ఇదే సమయంలో సంవత్సరం చివరిలో అమ్మకాలు మొదటి అర్ధభాగం కంటే చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా!

Tags:    

Similar News