లైఫ్ లో ట్రిపుల్-8 రూల్ పాటిస్తే... ట్రిపుల్ ఆర్ కంటే పెద్ద సక్సెస్ కన్ఫాం!

అవును... ప్రతీ మనిషి జీవితంలోనూ రోజుకి 24 గంటలే ఉంటాయి. అయితే ఇందులో చాలా మంది వృత్తి పరమైన జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని.

Update: 2024-08-18 13:30 GMT

ఓ మనిషి జీవితంలో అన్నింటికంటే విలువైనది సమయం అని అంటారు. ఈ సమయాన్ని ఎంత బాగా మేనేజ్మెంట్ చేస్తే అంద విలువైన ప్రయోజనాలు జీవితంలో లభిస్తాయని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న వర్క్ కల్చర్ లో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది ఉద్యోగుల జీవితాల్లో అతి క్లిష్టమైన అంశంగా మారిపోతోందని చెబుతున్నారు. అయితే దీనికి ఓ పరిష్కారాన్ని తెరపైకి తెస్తున్నారు నిపుణులు!

అవును... ప్రతీ మనిషి జీవితంలోనూ రోజుకి 24 గంటలే ఉంటాయి. అయితే ఇందులో చాలా మంది వృత్తి పరమైన జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని.. వ్యక్తిగత జీవితం కోసం కుటుంబ జీవితాన్ని దూరం చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటారని అంటారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో వ్యక్తిగత సమస్యలను ఫెస్ చేస్తుంటారని చెబుతుంటారు. ఈ సమయంలో ట్రిపుల్-8 రూల్ ఒకటి అందుకు తగిన పరిష్కారం అని అంటున్నారు.

ఈ ట్రిపుల్-8 రూల్ ప్రకారం... ఒక రోజులో ఉండే 24 గంటలను ఎనిమిదేసి గంటల చొప్పున విభజించుకోవాలి. ఇందులో భాగంగా.. ఎనిమిది గంటలు ఉద్యోగానికి ఖర్చు చేస్తే.. మరో ఎనిమిది గంటలను మీ అలవాట్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడిపడానికి వినియోగించుకోవాలి. మిగిలిన ఎనిమిది గంటలూ నాణ్యమైన నిద్రకు కేటాయించుకోవాలి.

ఇలా రోజుని ప్లాన్ చేసుకోవడం ద్వారా శారీరక, పాటు మానసిక ఆరోగ్యం జీవితంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకొనేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రూల్ ని దైనందిన జీవితంలో ఓ అలవాటుగా మార్చుకుంటే... దీర్ఘకాలంలో ఎన్నో సత్ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. ఫలితంగా మీ అభిరుచులకు కేటాయించే సమయాన్ని పెంచుకోవచ్చని అంటున్నారు.

అయితే ప్రస్తుతం మెజారిటీ ఉద్యోగుల జీవితాలు యాంత్రికమైపోయిన నేపథ్యంలో... ఈ రూల్ ని అమలుచేసుకోవడం అంత తేలిక కాదనే చెప్పాలి. ప్రతీ రోజునీ ఎనిమిదేసి గంటల చొప్పున షెడ్యూల్ చేసుకుని అమలు చేయాలంటే ఇందులో అనేక రకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. కాకపోతే... సరైన ప్రాణాళిక వేసుకుని, అంకితభావంతో పాటిస్తే మాత్రం... గొప్ప విజయాలు సాధించవచ్చు!

Tags:    

Similar News