ఈ ఇండియన్ సన్ కి 21వ బర్త్ డే... బ్యాడ్ న్యూస్ చెప్పిన యూఎస్!

చిన్నతనంలోనే తల్లితండ్రులతో అమెరికాకు వెళ్లిన వారు అక్కడే పెరిగి, అక్కడే చదువుకున్నారు.

Update: 2024-09-15 15:33 GMT

చిన్నతనంలోనే తల్లితండ్రులతో అమెరికాకు వెళ్లిన వారు అక్కడే పెరిగి, అక్కడే చదువుకున్నారు. ఈ క్రమంలో వీరిలో 21 ఏళ్లు నిండిన వారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో... వీరందరినీ దేశాన్ని వదిలి వెళ్లిపోండని అంటుంది అమెరికా ప్రభుత్వం. తాజాగా 21వ బర్త్ డే జరుపుకుంటున్న ఓ భారతీయుడి కుమారుడికి ఇప్పుడు బ్యాడ్ టైం అని అంటున్నారు!

అవును... చిన్నప్పుడే తల్లితండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి డిపెండెంట్ వీసాతో ఉన్న పిల్లలో 21 ఏళ్లు నిండిన వారికి ఆ దేశం నుంచి షాకులు తగులుతున్నాయి. పేరెంట్స్ పై ఆధారపడిన బిడ్డగా హెచ్-4 వీసాపై ఉన్న వారికి హెచ్-1బీ వీసా ఉన్న అతడి తల్లితండ్రులు గ్రీన్ కార్డ్ కోసం దరఖస్తు చేసుకున్నారు. అయితే.. అది ఇంకా పెండింగులోనే ఉంది. ఈ లోపు పిల్లలకు 21ఏళ్లు నిండడంతో షాక్ తగులుతుంది.

తాజాగా... ఓ భారతీయ కుటుంబానికి ఈ షాక్ తగిలింది. వీరి అనుభవం ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటున్న అనేక కుటుంబాల పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ క్రమంలో తాజాగా తన తండ్రికి నవంబర్ లో హెచ్-1బీ పొడిగింపు వచ్చే సమయానికి కొడుకు వయసు 21 సంవత్సరాలు కాబట్టి.. దీంతో ఇకపై ఆ కుమారుడు డిపెండెంట్ గా పరిగణించబడడం లేదు.

దీంతో... అతడు త్వరలో యూఎస్ లో ఉండే చట్టపరమైన అర్హతను కోల్పోనున్నాడు. అతడి పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్ వచ్చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అది రాకపోయినా.. ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నా.. ఈ లోపే 21 ఏళ్లు నిండటంతో ఇప్పుడు అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట.

కాగా... ఉద్యోగాల మీద అమెరికాకు వెళ్లే పేరెంట్స్ వెంట పిల్లల్ని అనుమతిస్తారు కానీ.. వారికి 21 ఏళ్లు నిండేలోపు పేరెంట్స్ కి గ్రీన్ కార్డు వస్తే వారికి శాశ్వత నివాసం దొరికినట్లే. అలాకాని పక్షంలో ఈ సమస్య ఎదురవుతుంది. పిల్లలకు ఉన్న డిపెండెంట్ వీసా రద్దవుతుంది. ఫలితంగా యూఎస్ ని పంపించేస్తారు.

Tags:    

Similar News